India Surpasses Japan: జపాన్‌ను దాటేసిన భారత్.. నాల్గవ అతి పెద్ద దేశంగా..
ABN , Publish Date - Dec 31 , 2025 | 04:30 PM
ప్రస్తుతం మొదటి స్థానంలో అమెరికా ఉండగా.. రెండో స్థానంలో చైనా ఉంది. ఈ రెండిటిని దాటి మొదటి స్థానంలో నిలిచే దిశగా భారత్ అడుగులు ముందుకు వేస్తోంది. అంతర్జాతీయ సంస్థలు కూడా భారత ఆర్థిక వ్యవస్థపై గట్టి నమ్మకంతో ఉన్నాయి.
అభివృద్ధి విషయంలో భారత్ అగ్ర దేశాలతో పోటీ పడుతోంది. గ్రాస్ డొమస్టిక్ ప్రాడెక్ట్(జీడీపీ) విషయంలో ఇప్పటికే జపాన్‌ను వెనక్కు తోసేసింది. నాల్గవ అతి పెద్ద దేశంగా నిలిచింది. భారత్ జీడీపీ 4.18 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. మొదటి మూడు స్థానాల్లో అమెరికా, చైనా, జర్మనీ దేశాలు ఉన్నాయి. భారత్ 2030 నాటికి జర్మనీని దాటేసి మూడో స్థానంలో నిలిచే అవకాశం ఉంది. 2025 - 2026 సెకండ్ క్వార్టర్‌లో భారత రియల్ జీడీపీ 8.2కు చేరింది. అంచెలంచెలుగా ముందుకు దూసుకు వెళుతూనే ఉంది. 2030 నాటికి భారత జీడీపీ 7.3 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం మొదటి స్థానంలో అమెరికా ఉండగా.. రెండో స్థానంలో చైనా ఉంది. ఈ రెండిటిని దాటి మొదటి స్థానంలో నిలిచే దిశగా భారత్ అడుగులు ముందుకు వేస్తోంది. అంతర్జాతీయ సంస్థలు కూడా భారత ఆర్థిక వ్యవస్థపై గట్టి నమ్మకంతో ఉన్నాయి. భారత గ్రోత్ రేట్ 2026లో 6.5కు చేరే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ చెబుతోంది. మూడీ అంచనా ప్రకారం.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జీ20 ఎకానమీ దేశంగా భారత్ నిలవనుంది. గ్రోత్ రేట్ 2026లో 6.4 శాతం.. 2027లో 6.5 శాతంగా ఉండనుంది.
అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు భారత్ వృద్ధి అంచనాలను పెంచుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) 2025 సంవత్సరానికి గాను భారత వృద్ధి రేటును 6.6 శాతంగా, 2026కి 6.2 శాతంగా అంచనా వేసింది. అలాగే సీఈసీడీ కూడా 2025లో 6.7 శాతం, 2026లో 6.2 శాతం వృద్ధి నమోదు అవుతుందని వెల్లడించింది. ఎస్ అండ్ పీ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం, వచ్చే ఏడాదిలో 6.7 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తోంది. ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) 2025కి తన అంచనాను పెంచుతూ 7.2 శాతం వృద్ధి ఉంటుందని చెప్పింది.
ఇదిలా ఉండగా, దేశంలోని ప్రధాన ఆర్థిక సూచీలు సానుకూలంగానే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ద్రవ్యోల్బణం అనుమతించిన కనిష్ట స్థాయికి దిగువన కొనసాగుతుండగా, నిరుద్యోగం క్రమంగా తగ్గుముఖం పడుతోందని, ఎగుమతులు కూడా స్థిరంగా మెరుగుపడుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వాణిజ్య రంగానికి బలమైన రుణ ప్రవాహం కొనసాగుతుండటంతో ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని, పట్టణ ప్రాంతాల్లో వినియోగం పెరుగుతుండటం వల్ల ఆర్థిక వృద్ధికి మరింత ఊతం లభిస్తోందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
కొత్త సంవత్సరం.. ఈ దేవాలయాలను సందర్శిస్తే అష్టైశ్వార్యాలు మీ సొంతం..!
చీకటి పాలన నుంచి.. పారదర్శక పాలన దిశగా..