నేటి.. బంగారం, వెండి ధరలు
ABN , Publish Date - Jan 22 , 2026 | 08:26 AM
ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావించడం వల్ల డిమాండ్ పెరగడం, అమెరికా-యూరప్ మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, డాలర్ బలహీనత, ద్రవ్యోల్బణ ఆందోళనలు వంటి కారణాలు బంగారం ధరల్ని అంతర్జాతీయ మార్కెట్లో పరుగులు పెట్టిస్తున్నాయి.
ఆంధ్రజ్యోతి, జనవరి 22: డాలర్ వాల్యూతో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోవడం, జియోపొలిటికల్ పరిస్థితుల కారణంగా నిన్న(బుధవారం) బంగారం ధరలు మోత మోగించాయి. ఇక, ఈ రోజు అంటే.. గురువారం (22-01-2026) ఉదయం 08:00 గంటల సమయానికి గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర భారతదేశంలో రూ.1,56,610గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,43,560కి చేరింది. కిలో వెండి ధర ఇవాళ (గురువారం) రూ.3,45,100గా ఉంది. ఇక హైదరాబాద్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,56,661 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1, 43,560కి చేరింది.
ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ( 24కే, 22కే) ధరలు
ముంబై: రూ.1,55,610, రూ.1,43,560
చెన్నై: రూ.1,57,270, రూ.1,44,160
న్యూఢిల్లీ: రూ.1,56,760, రూ.1,43,710
విజయవాడ: రూ.1,56,661, రూ.1,43,560
హైదరాబాద్: రూ.1,56,661, రూ.1,43,560
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి..
కాకినాడ పీబీసీ కాల్వలో స్పిరిట్ లారీ బోల్తా.. ప్రజలకు అధికారుల హెచ్చరికలు
భారత్, ఇజ్రాయెల్ ఆర్థిక సహకారానికి దావోస్ వేదిక: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News