Home » BRS
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారులకు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను పీవీఆర్ అందజేశారు.
సిద్దిపేటలో బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో కొందరు బీఆర్ఎస్ నాయకులు పార్టీ కండువాలతో నిరసనలో పాల్గొన్నారు.
రేవంత్‌రెడ్డి హయాంలో వ్యాపారవేత్తలకు తుపాకులు పెట్టే సంస్కృతిని తీసుకొచ్చారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆక్షేపించారు. ముఖ్యమంత్రి సన్నిహితులే తుపాకీ పెట్టి బెదిరించే పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందని హరీశ్‌రావు ప్రశ్నల వర్షం కురిపించారు.
ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పదిలంగా ఉందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
ముఖ్యమంత్రి అనుచరుడు రోహిన్ రెడ్డి ఆఫీస్‌లోనే తుపాకీ పెట్టి బెదిరించటమే ఇందుకు నిదర్శనమన్నారు ఆర్ఎస్ ప్రవీణ్. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను కోరనున్నట్లు తెలిపారు.
నగరంలో ఆ నియోజకవర్గానికి ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించిన చరిత్ర దివంగత పీజేఆర్‌కు ఉంది. ప్రత్యర్థులను కూడా తన వాళ్లు చేసుకొని రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పీజేఆర్ వారసులు ఇప్పుడు ఆదిపత్యం కోసం పోరాడుతున్నారు.
తెలంగాణకి కాంగ్రెస్, బీజేపీలు ద్రోహం చేశాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ బిహార్‌లో ఓటు చోరీ అంటున్నారని... జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి మాత్రం ఓటు చోరీ చేస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు.
హైదరాబాద్‌కు చెందిన ఐపీఎస్ అధికారి పూరణ్ ఉన్నత అధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవడం బాధకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులు గడుస్తున్న కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని ఆరోపించారు.
గడిచిన రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని, అమలు కాని హామీలతో కాంగ్రెస్ పాలకులు ప్రజలను మోసం చేశారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీఫాం అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ.40 లక్షల చెక్కును అందజేశారు గులాబీ బాస్.