ఆధారాలు బయటపెట్టండి.. కేటీఆర్‌కు బల్మూరి వెంకట్ సవాల్
ABN , Publish Date - Jan 20 , 2026 | 04:37 PM
మాజీ మంత్రి కేటీఆర్‌పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం స్కామ్‌లేని కేటీఆర్ అంటున్నారని.. ఆధారాలుంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు.
హైదరాబాద్, జనవరి 20: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(MLC Balmuri Venkat) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం హరీశ్ రావు అవయవాలు దానం చేసినట్లు.. బామ్మర్ది పోయి బావను పరామర్శిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో అత్యధికంగా కేసులు పెట్టి తనను ఇబ్బందులకు గురిచేశారని గుర్తుచేశారు. ‘గాంధీ భవన్ లోపలికి వచ్చి అర్ధరాత్రి నన్ను అరెస్ట్ చేశారు. నా కుటుంబ సభ్యులు సహా మా వాచ్‌మెన్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. రేవంత్ రెడ్డిపై డ్రోన్ కేసు పెట్టి 14 రోజులు జైల్లో పెట్టలేదా? గత ప్రభుత్వంలో ఎథికల్ హ్యాకర్‌ను ట్రైనింగ్ కోసం బయటి దేశాలకు పంపారా? లేదా.? నేను ఎక్కడికైనా వచ్చి ప్రమాణం చేస్తా, మీరూ వచ్చి ప్రమాణం చేస్తారా?' అని ఎమ్మెల్సీ వెంకట్ సవాల్ విసిరారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన ఆరోపణలకు బల్మూరి కౌంటర్ ఇస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తంలో స్కామ్‌లే అని కేటీఆర్ అంటున్నారని.. ఆధారాలుంటే బయటపెట్టాలని ఛాలెంజ్ చేశారు. కల్వకుంట్ల కుటుంబ గూడుఫుటానీలో కవిత భాగస్వామి అని.. అందుకే ఆమెను బయటకు పంపారన్నారు. కేటీఆర్ పదే పదే సృజన్ రెడ్డి అని ఆరోపణలు చేస్తున్నారని..
ఆయన చెప్తున్న సృజన్ రెడ్డి.. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడేనని బల్మూరి వివరించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి వెంకట్ మాట్లాడుతూ.. చక్రధర్ గౌడ్ వేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టేసిందని.. ఫోన్ ట్యాపింగ్ కేసుకు దానికి సంబంధం లేదన్నారు. ఏ విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ‘లోపల జరుగుతున్న విచారణ మీకు ఎలా తెలుసు? మీకు ఎవరైనా కోవర్ట్‌లు ఉన్నారా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ బల్మూరి.
ఇవి కూడా చదవండి...
సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు సీరియస్..
చట్టాల మీద గౌరవంతోనే సిట్ విచారణకు హరీశ్: న్యాయవాది చంద్రశేఖర్
Read Latest Telangana News And Telugu News