Home » BRS
పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెంపపెట్టు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేసిన నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రస్థానం చర్చనీయాంశంగా మారింది.
ఫాంహౌజ్ చుట్టూ సుడా పేరిట భూకబ్జా చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ నేత తీవ్రంగా స్పందించారు. ఆయనపై బురదజల్లే ఉద్దేశంతోనే కాంగ్రెస్ అబద్దాలు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు.
మాజీ మంత్రి హరీశ్ రావు మాటలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. అక్రమభూముల వ్యవహారంపై ప్రజలకు అవగాహన కల్పించడానికే సిద్ధిపేటకు వచ్చామని.. ఎవరి భూములూ లాక్కోవడానికి రాలేదని ఎద్దేవా చేశారు.
మాజీ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఓవర్ లాప్ ల్యాండ్‌పై కేసీఆర్ తిష్ఠ వేశారని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.
గత ప్రభుత్వంలో లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని.. మరి కేసులు పెట్టి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.
ప్రీతిరెడ్డి పుట్టినరోజు ఫ్లెక్సీల్లో కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు లేకపోవడంపై బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఫ్లెక్సీల చించివేతపై స్పందించిన ప్రీతిరెడ్డి, తన పుట్టినరోజు వేడుక రాజకీయ కార్యక్రమం కాదని తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ ఆస్తులు పెరిగిపోవడంపై విచారణ జరగాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ‘ఆఫ్ ది రికార్డ్’ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘నాకు మంత్రి పదవి అవసరం లేదు. కానీ.. ఒకే ఒక గంట హోంమంత్రి పదవి ఇప్పిస్తే దోపిడీదొరలను లోపలేయిస్తా..’ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. ఈ మేరకు ఆయన బీఆర్ఎస్ పార్టీపైన నిప్పులుచెరిగారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మేడ్చల్ నియోజకవర్గంలో రాజకీయ వివాదానికి దారితీశాయి. ఫ్లెక్సీని కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ చించివేశారు.