Home » BRS
బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్‌కు సుప్రీంకోర్టు ఇచ్చిన 90 రోజుల గడువుపై ఉన్నత న్యాయస్థానం తీర్పు వచ్చే వరకు బీసీ రిజర్వేషన్ విషయంలో వేచి చూస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సమయం ఆసన్నమవుతుండటంతో ప్రధాన పార్టీలు తమ అభ్యుర్థుల ఎంపిక విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది.
తెలంగాణ కాంగ్రెస్ పాలనలో పేదోని పొట్టగొట్టి.. పెద్దోళ్ల బొజ్జనింపడమే పనిగామారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఎక్స్‌వేదికగా ఆరోపించారు. హైడ్రా ఉద్యోగులకు నెలకు రూ.5000, మైనారిటీ విద్యాసంస్థల్లోని సిబ్బందికి నెలకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు వేతనంలో కోత విధించడం దారుణమని అన్నారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో గురువారం జీహెచ్‌ఎంసీ యూసుఫ్‌గూడ సర్కిల్-19 కార్యాలయాన్ని ఎన్నికల పరిశీలకుడు సర్ఫరాజ్ అహ్మద్ సందర్శించారు. ఈఆర్‌ఓ, సర్కిల్-19 డీఎంసీ రజనీకాంత్ రెడ్డి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు.
రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌పై మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎందుకు మారుస్తోందని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కుట్ర జరుగుతోందంటూ సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం గ్రామాల రైతులు మాజీ మంత్రి హరీశ్‌రావును సోమవారం కలిసి పలు సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రైతులు భూములు కోల్పోకుండా అలైన్‌మెంట్‌లో మార్పులు చేసే విధంగా తమ పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తానని అన్నారు.
నిరుద్యోగులకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు. భారీస్థాయిలో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని బండి సంజయ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్‌లో చేరికలను ఆహ్వానించామని ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. ఇంట్రెస్ట్ ఉన్న నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరాలని సూచించారు. మీడియా ముందు అంతర్గత విషయాలు మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని మల్లు రవి హెచ్చరించారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ఘటన జరిగి 200రోజులు దాటినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.