Telangana political news: స్పీకర్ తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..
ABN , Publish Date - Dec 17 , 2025 | 06:06 PM
ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని, ఆయన నిర్ణయంపై హైకోర్టుకు వెళ్తామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కె.సంజయ్ తెలిపారు. ఇది స్పీకర్ నిర్ణయం కాదని, జూబ్లీహిల్స్ ప్యాలెస్ రాజు నిర్ణయమని విమర్శించారు.
ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని, ఆయన నిర్ణయంపై హైకోర్టుకు వెళ్తామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కె.సంజయ్ తెలిపారు. ఇది స్పీకర్ నిర్ణయం కాదని, జూబ్లీహిల్స్ ప్యాలెస్ రాజు నిర్ణయమని విమర్శించారు. స్పీకర్‌ను ముఖ్యమంత్రి ఇబ్బంది పెడుతున్నారని సంజయ్ పేర్కొన్నారు (remarks against Speaker).
జూబ్లీహిల్స్ ప్యాలెస్ రాజు నుంచి ఎప్పుడో జడ్జిమెంట్ వచ్చిందని, ఆర్డర్ కాపీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి వచ్చిందని సంజయ్ విమర్శించారు. ట్రెజరీ బెంచ్‌కి టాయిలెట్ దగ్గరగా ఉంటుందని కాంగ్రెస్ వాళ్ళ పక్కన కూర్చున్నామని తమ ఎమ్మెల్యేలు చెబుతున్నారని సంజయ్ అన్నారు. 'మా వాదనలు పట్టించుకోకుండా ఏకపక్షంగా తీర్పునిచ్చారు. స్పీకర్ తీరు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. తీర్పు కాపీని అధ్యయనం చేసి హైకోర్టుకు వెళ్తామ'ని సంజయ్ తెలిపారు (Kalvakuntla Sanjay press meet).
ట్రిబ్యునల్ చైర్మన్ గా ఉన్న స్పీకర్ తీర్పును వ్యతిరేకిస్తున్నామని, స్పీకర్ రాజ్యాంగానికి, చట్టానికి లోబడి ఉండాలని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు (Telangana Assembly issue). స్పీకర్ పూర్తిగా విఫలమయ్యారని, స్పీకర్ తీర్పుపై జనాలు నవ్వుకుంటున్నారని, వ్యవస్థలపై ఉన్న నమ్మకం పోయిందని అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఉప ఎన్నికలు వస్తాయా అని సీఎం అన్నారని, తాజాగా స్పీకర్ జడ్జిమెంట్ కూడా సీఎం మాటలలాగానే ఉందని విమర్శించారు.
ఇవి కూడా చదవండి...
ఉత్కంఠకు తెర.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈరోజే తీర్పు
ఒక్కో ఓటుకు రూ.3 వేలు.. డబ్బులు తీసుకుని కూడా..