Home » BRS
ఎన్నికల హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చకు సిద్ధమని హరీష్ రావు సవాల్ విసిరారు. అసెంబ్లీ నిర్వహించమంటే సీఎం రేవంత్ రెడ్డి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతోంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలకు దసరా పండగ ఖర్చు భారీగానే అవుతోంది. మద్యం, మామూళ్లు ఇవ్వాలంటూ చోట, మోటా నేతలు ఆశావహుల ఇళ్ల వద్ద క్యూ కట్టారు. కొందరూ ఆశావహులు రెండు రోజులుగా పంపకాలను ప్రారంభించారు.
ఐదు డీఏలను పెండింగ్‌లో పెట్టిన ఘనత దేశంలో ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. నెలకు రూ. 750 కోట్ల ఎరియర్స్ క్లియర్ చేస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
కేటీఆర్ ప్రతిదీ రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే.. ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూ పైన మాట్లాడారా? అని ఆయన కేటీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం ఎర్రగడ్డలోని షంషీర్ ఫంక్షన్ హాల్‌లో డివిజన్‌కు సంబంధించిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో చిరస్థాయిగా గుర్తుండిపోయే పోరాటరూపాల్లో సాగరహారం ఒకటని, నాటి సాగరహారానికి నేటితో 13 ఏళ్లు నిండాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రోజులు గడుస్తున్నా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదంటూ.. బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే..
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా చర్చకు రావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. 90 శాతం పనులు పూర్తి చేసినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు మర్చిపోలేదని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులతో చేసిన గారడీలను గుర్తుచేసేందుకు తాము 'బాకీ కార్డులను' తీసుకెళ్తున్నామని తెలిపారు.