Home » BJP
తెలంగాణలో ప్రజల సొమ్ము దోచుకోవడంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్ పదేళ్ల అవినీతిని మించి కాంగ్రెస్ దోచుకోవాలని చూస్తోందని విమర్శించారు.
పార్లమెంట్ సమావేశాలను వరుసగా అడ్డుకుంటూ, విపక్షాలు వ్యవహరిస్తున్న తీరుపై అధికార భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రతిపక్షాల ఈ తరహా ధోరణి వారి 'అరాచక మనస్తత్వాన్ని' ప్రతిబింబిస్తోందని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు.
జార్ఖండ్‌లో జరిగిన SSC పరీక్షలో అవకతవకలు జరిగినట్లు తేలిందని.. ఈ క్రమంలోనే విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. వారిపైనా రబ్బర్ బుల్లెట్స్, లాఠీఛార్జి చేశారన్నారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మరోసార్ హాట్ కామెంట్స్ చేశారు. కోర్ట్‌ను తప్పుదోవ పట్టిస్తూ కాలయాపన చేయడం సరికాదన్నారు.
హర్ ఘర్ తిరంగాతో ప్రతి ఇంటా దేశభక్తి చాటాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు పిలుపునిచ్చారు. ఆగస్టు 14న ట్యాంక్ బండ్ దగ్గర భారీ ‘తిరంగా యాత్ర’ను నిర్వహిస్తున్నామని.. పార్టీలకతీతంగా ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. BJP, RSS లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో వీరి పాత్ర శూన్యమని, అలాంటి వాళ్ల నుంచి కాంగ్రెస్ దేశభక్తి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
మహిళా రిజర్వేషన్ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. 'ఎక్స్' సోషల్ మీడియా వేదికగా పరస్పరం స్పందించారు.
బెంగాల్ విజయం తర్వాత బీజేపీ హైకమాండ్ చూపు ఇప్పుడు తెలంగాణపై పడింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావాలంటే నేతలంతా విభేదాలు వీడి ఐక్యంగా ముందుకు సాగాలని పార్టీ పెద్దలు స్పష్టం చేశారు.
హిందూ దేవుళ్లపై సోషల్ మీడియాలో పోస్ట్‌లు, నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై సైబర్ క్రైమ్ డీజీ రవిశంకర్‌కు బీజేపీ నేతల బృందం ఫిర్యాదు చేసింది. హిందూ దేవుళ్లపై అనరాని మాటలు అంటున్నారని భాను ప్రకాశ్ మండిపడ్డారు.
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ బంధువు చంద్ర కుమార్ బోస్ తృణమూల్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. BJPని వీడిన తర్వాత, అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీలో చేరిన బోస్, ఇప్పుడు మరో రాజకీయ మార్పు దిశగా అడుగులు వేశారు.