KCR: మోదీ పంపిన 'చీటీ' ప్రకారమే కేసీఆర్ కదలికలు: ఆది శ్రీనివాస్
ABN , Publish Date - Dec 21 , 2025 | 02:54 PM
తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు. మూడు రోజుల క్రితం కేసీఆర్‌కు మోదీ ఒక చీటీ పంపారని, చీటీలోని పనిని చేయడానికే కేసీఆర్ ఇప్పుడు బయటకి వచ్చారని ఆయన ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి దోస్తానా..
హైదరాబాద్, డిసెంబర్ 21: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హీట్ పెరిగింది. ప్రభుత్వ విప్, కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పార్టీ కార్యాలయానికి రావడం కాదు, అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ - బీజేపీ మధ్య 'చీకటి దోస్తానా' ఉందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ కేసీఆర్‌కు ఒక 'చీటీ' పంపారని, ఆ పని చేయడానికే కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
'మునిగిపోతున్న పార్టీని కాపాడుకోవడం కోసమే కేసీఆర్ బయటకు వచ్చారు. ప్రజల కోసం కాదు. మోదీ.. కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీయడం దేనికి సంకేతం? ఇంకా ఎంతకాలం ఈ చీకటి దోస్తానా చేస్తారు?" అని ప్రశ్నించారు. గతంలో నల్ల చట్టాలకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని, ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగిస్తే బీఆర్ఎస్ నాయకులు నోరు మెదపకపోవడాన్ని విమర్శించారు.
KCR వస్తే అసెంబ్లీలో చర్చిద్దామని సవాల్ విసిరిన ఆది శ్రీనివాస్, ఎనిమిది లక్షల కోట్ల అప్పులు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోవడం వంటి అంశాలపై కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణా-గోదావరి జలాలను రాయలసీమకు మళ్లిస్తానని మాజీ మంత్రి రోజా ఇంటికి వెళ్లి కేసీఆర్ చెప్పారని, దీనికి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి
స్కూల్ వ్యాన్ రాలేదని.. రోడ్డుపైనే 3 గంటల పాటు చిన్నారి...
ఆ అద్భుత భవనాలపై ఓ లుక్కేద్దామా...
Updated Date - Dec 21 , 2025 | 09:07 AM