Share News

MLA Rajasingh: నేడు కాకపోతే రేపైనా సొంతింటికి వెళ్లాల్సిందే..

ABN , Publish Date - Dec 26 , 2025 | 08:10 PM

ఎమ్మెల్యే రాజాసింగ్ అంటేనే తెలంగాణ రాజకీయాల్లో ఓ సంచలనం. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేసినా.. అవి ఇట్టే వైరల్ అయిపోతుంటాయి. తాజాగా రాజాసింగ్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ రోజు కాకపోయినా.. రేపైనా తాను కూడా సొంతింటికి వెళ్లాల్సి వస్తుందని చెబుతూ అసలు విషయం బయటపెట్టాడు. తాను మళ్లీ బీజేపీలో చేరనున్నట్లు హింట్ ఇచ్చేశాడు. అలాగే పార్టీ పెద్దలపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

MLA Rajasingh: నేడు కాకపోతే రేపైనా సొంతింటికి వెళ్లాల్సిందే..

ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) మాట్లాడుతూ.. ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉండి, ఒక అన్నయ్య గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోతే.. ఏదో ఒక రోజు అతను ఇంటికి తిరిగి రావాల్సి ఉంటుందన్నారు. అలాగే తాను కూడా ఈ రోజు కాకపోయినా రేపైనా తన ఇంటికి తిరిగి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఆ శుభ సమయం ఎప్పుడు వస్తుందో చెప్పలేనంటూ దాటవేశారు. తాను బీజేపీకి (BJP) నిజమైన సైనికుడిని అని తెలిపారు. ఢిల్లీ లేదా రాష్ట్ర నాయకులు తనను పిలిచిన రోజున తిరిగి పార్టీలోకి వస్తానని తేల్చి చెప్పారు. ఇంతకు ముందు కూడా తాను ఇదే అభ్యర్థన చేశానని.. ఇప్పుడు కూడా అదే అభ్యర్థన చేస్తున్నానని చెప్పారు.


అసెంబ్లీలో స్వేచ్ఛ కల్పించాలని, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీకి వారి నియోజకవర్గంలో స్వేచ్ఛ ఇవ్వాలని.. అప్పుడే బీజేపీ భవిష్యత్తులో అధికారంలోకి రాగలదని రాజాసింగ్ అన్నారు. ఈరోజు కాకపోయినా రేపైనా తనకు ఢిల్లీ పెద్దల నుండి లేదా రాష్ట్ర పెద్దల నుంచి పిలుపు వస్తుందని ఖచ్చితంగా తెలుసని చెప్పారు. వారి నుంచి ఫోన్ వస్తే.. తాను ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తానని అన్నారు. తమకు పార్టీ పెద్ద నాయకులు నుంచి స్వేచ్ఛ ఇవ్వండి అని కోరతానని చెప్పారు. అలా స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత.. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో తాము ఏ విధంగా యుద్ధం చేస్తామో అంతా చూస్తారని రాజాసింగ్ పేర్కొన్నారు.


ఎమ్మెల్యే రాజాసింగ్‌ కొంతకాలం క్రితం బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఏ పార్టీలో చేరకుండా ఒంటరిగానే ఉన్నారు. అయితే ఇటీవల ఆయన తిరిగి మళ్లీ బీజేపీలో చేరతారంటూ ఊహాగానాలు వస్తున్నాయి. ఈ విషయమై ఆయన..పార్టీ అగ్రనేతలతో చేసిన చర్చలు సఫలమైనట్లు కూడా తెలుస్తోంది. నెల రోజుల్లో ఆయన కాషాయ కండువా కప్పుకోవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజాసింగ్ వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

రేవంత్ రెడ్డిని భీమవరం బుల్లోడు అనాలా: కేటీఆర్

విమాన ప్రయాణం.. ప్రయాణికుల్లో కలవరం

For More TG News And Telugu News

Updated Date - Dec 26 , 2025 | 08:10 PM