Home » Bihar
అక్టోబర్ 6న ఎన్నికల ప్రకటన విడుదల చేసినప్పటి నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకూ రూ.71.32 కోట్లు విలువచేసే నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, కీలకమైన మెటల్స్, ఇతర ఉచితాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ తెలిపింది.
ఓ మహిళ కొత్తగా వేసిన కాంక్రీట్ రోడ్డును పాడు చేసి కాంక్రీట్ ఎత్తుకెళ్లిపోయింది. అది కూడా అందరూ చూస్తుండగానే కొంచెం కూడా భయపడకుండా కాంక్రీట్ తీసుకెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నితీష్ ఆరోగ్యంపై తేజస్వి కామెంట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రధాని మోదీ కార్యక్రమంలో నితీష్ కుమార్ తన నివాసం నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. టీవీ స్క్రీన్‌లో మోదీ వైపు చూస్తూ తన రెండు చేతులను జోడిస్తూ నితీష్ ఉండిపోయారు.
నామినేషన్లు వేసిన వారిని బెదిరించి వాటిని ఉపసంహరించుకోవడం ద్వారా పోటీ లేకుండా గెలవాలనే సూరత్ మోడల్‌ను బీజేపీ అమలు చేయాలనుకుంటోందని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు
శశి భూషణ్ సింగ్ డీసీఎల్ఆర్ కార్యాలయంలో సోమవారంనాడు నామినేషన్ వేశారు. ఆయన నామినేషన్ అసంపూర్తిగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీపీఐ వంటి అన్‌రిజిస్టర్డ్ పార్టీల నుంచి 10 మంది ప్రపోజర్లు నామినేషన్ దాఖలుకు అవసరం.
కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు డిమాండ్ చేస్తుండగా 52 నుంచి 55 సీట్లు ఇస్తామంటూ ఆర్జేడీ ప్రతిపాదించింది. దీంతో ఇరు భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయలోపం తలెత్తింది. ఇదేవిధంగా వామపక్ష పార్టీలు 40 సీట్లు అడుగుతున్నాయి.
ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, రాజకీయ వారసుడు తేజస్వి యాదవ్ వరుసగా మూడోసారి రఘోపూర్ నియోజకవర్గం పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి శకుని చౌదరి కుమారుడు సమ్రాట్ చౌదరిని తారాపూర్ అభ్యర్థిగా బీజేపీ నిలబెట్టింది.
మధుబన్ అసెంబ్లీ నుంచి టిక్కెట్ ఆశించిన ఆర్జేడీ నేత మదన్ షా తనకు టిక్కెట్ దక్కకపోవడంతో లాలూ నివాసం బయట కుర్తా చింపుకుని, నేలపై పడుకుని గుక్కపెట్టి ఏడుపు అందుకున్నాడు.
బిహార్‌లోని చకాయి, ధమ్‌దాహా, కటోరియా, పీర్‌పైంతీ, మనిహారి, జముయి సీట్లలో తాము అభర్థులను నిలబెట్టనున్నట్టు జేఎంఎం ప్రకటించింది. మొత్తం ఆరు సీట్లలో జేఎంఎం పోటీ చేయాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రతినిధి సుప్రియో భట్టాచార్య తెలిపారు.
జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిందని, పంచాయతీలు, మున్సిపాలిటీలతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు కూడా జరిగాయని, రాజ్యసభ ఎన్నికలు కూడా త్వరలో జరగనున్నాయని అమిత్‌షా చెప్పారు.