Share News

Bihar Elections: షహబుద్దీన్ ఐడియాలజీని ఓడించండి.. అమిత్‌షా పిలుపు

ABN , Publish Date - Oct 24 , 2025 | 05:45 PM

చొరబాటుదారులను సివాన్‌లో ఉండనీయాలని రాహుల్ గాంధీ చెబుతున్నారని, అయితే తాను చాలా స్పష్టంగా ఒకమాట చెబుతున్నానని అమిత్ షా అన్నారు. ఎన్డీయేకు ఓటు వేసి గెలిపిస్తే దేశంలోని ప్రతి ఒక్క చొరబాటుదారుని వెనక్కి పంపించి తీరుతామని హామీ ఇచ్చారు.

Bihar Elections: షహబుద్దీన్ ఐడియాలజీని ఓడించండి.. అమిత్‌షా పిలుపు
Amit Shah in Siwan

పాట్నా: ముఠా నాయకుడి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మహమ్మద్ షహబుద్దీన్ (Mohammad Shahabuddin) ఐడియాలజీని బిహార్ ఓటర్లు చిత్తు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah) కోరారు. షహబుద్దీన్ ఐడియాలజీతో రాష్ట్రం ఎంతగానో నష్టపోయిందని, ఇప్పుడు నితీష్ కుమార్, నరేంద్ర మోదీ నాయకత్వంలో 100 మంది షహబుద్దీన్‌లు వచ్చినా ఎవరికీ ఎలాంటి హాని చేయలేరని చెప్పారు.


బిహార్‌లోని సివాన్‌‌లో శుక్రవారం నాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా మాట్లాడుతూ.. 'షహబుద్దీన్ (ఎ కేటగిరి రౌడీషీటర్)పై 20 ఏళ్లుగా 75 కేసులున్నాయి. రెండు జైల్ టర్మ్స్ ఉన్నాయి. అందులో మూడు హత్యలు, ఎస్‌పీపై దాడి.. బిజినెస్ ఓనర్ల కుమారులపై వాళ్ల చర్మం బయటకు వచ్చేంతవరకూ యాసిడ్ దాడులు వంటివి ఉన్నాయి. అయినప్పటికీ ధైర్యవంతులైన శివన్ ప్రజలు 20 ఏళ్లపాటు ఓర్చుకుంటూ వచ్చారు. ఎన్నడూ షహబుద్దీన్‌కు లొంగలేదు. ఇప్పుడు ఆయన కుమారుడికి లాలూ ప్రసాద్ యాదవ్ రఘునాథ్‌పూర్ నుంచి టికెట్ ఇ్చచారు. నితీష్, నరేంద్ర మోదీ పాలనలో 100మంది షహబుద్దీన్‌లు వచ్చినా ఏ ఒక్కరికీ హాని చేయలేరు' అని అమిత్‌షా అన్నారు.


ఒక్క చొరబాటుదారున్ని కూడా వదలం

బిహార్‌తో సహా దేశంలో ఎక్కడ చొరబాటుదారులు ఉన్నా వారిని వెనక్కి పంపుతామని అమిత్‌షా స్పష్టం చేశారు. చొరబాటుదారులను సివాన్‌లో ఉండనీయాలని రాహుల్ గాంధీ చెబుతున్నారని, అయితే తాను చాలా స్పష్టంగా ఒకమాట చెబుతున్నానని, ఎన్డీయేకు ఓటు వేసి గెలిపిస్తే దేశంలోని ప్రతి ఒక్క చొరబాటుదారుని వెనక్కి పంపించి తీరుతామని అన్నారు.


నవంబర్ 14న నిజమైన దీపావళి

లాలూ కుమారుడు ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయే నవంబర్ 14 నాడే నిజమైన దీపావళి వస్తుందని అమిత్‌షా చమత్కరించారు. జంగిల్ రాజ్‌కు నితీష్ కుమార్ చరమగీతం పాడారని, ఆటవిక పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించారని అన్నారు. 20 ఏళ్ల తర్వాత కూడా తాము నితీష్ కుమార్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

ప్రతిపక్ష నేత అశోక్‌ సంచలన కామెంట్స్.. ఢిల్లీలోని ఇటలీ టెంపుల్‌ చుట్టూ..

మళ్లీ.. రాష్ట్ర పర్యటనకు విజయ్‌

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 24 , 2025 | 06:20 PM