Home » Bihar
ఛఠ్ పండుగ కోసం బిహార్‌కు వెళ్లే వలస కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. కొన్ని రైళ్లు సామార్థ్యానికి మించి 200 శాతం కెపాసిటీతో నడుస్తున్నాయని, కేంద్రంలోనూ, బిహార్‌లోనూ అధికారంలో ఉన్న 'డబుల్ ఇంజన్' ప్రభుత్వం పనితీరు ఇదేనా అని నిలదీశారు.
నితీష్ తరువాత మోదీ తన ప్రసంగాన్ని మొదలుపెట్టడంతో జనం తమ మొబైల్స్‌ను క్లిక్‌మనిపించారు. వెంటనే మోదీ చిరునవ్వులు చిందిస్తూ... ఇంతగా వెలుగులు విరజిమ్ముతుంటే ఎవరికైనా లాంతర్లు (ఆర్జేడీ గుర్తు) అవసరమవుతాయా? అని ప్రశ్నించారు.
తొలుత 15 సీట్లలో మహాకూటమి అభ్యర్థులు ఒకరితో మరొకరు తలపడుతూ నామినేషన్ల వేశారు. దీంతో గందరగోళం నెలకొంది. గురవారంనాడు జరిగిన మహాకూటమి నేతల మీడియా సమావేశంలో షీట్ల షేరింగ్ వివరాలను వెల్లడిస్తారనే ఊహాగానాలు వెలువడినప్పటికీ దానిపై ఎలాంటి ప్రకటన చేయకుండానే సమావేశం ముగిసింది.
ఆర్జేడీ జంగిల్ రాజ్‌కు ఎన్డీయే స్వస్తి చెప్పి రాష్ట్రంలో సుపరిపాలన తెచ్చిందని మోదీ అన్నారు. ఆర్జేడీ-కాంగ్రెస్ హయాంలో పెట్టుబడిదారులు రాష్ట్రం విడిచిపెట్టి పోయారని, ఉద్యోగాల పేరుతో భూములు లాక్కున్న వాళ్లు యువతకు ఉద్యోగాలు ఇచ్చిందే లేదని విమర్శించారు.
చొరబాటుదారులను సివాన్‌లో ఉండనీయాలని రాహుల్ గాంధీ చెబుతున్నారని, అయితే తాను చాలా స్పష్టంగా ఒకమాట చెబుతున్నానని అమిత్ షా అన్నారు. ఎన్డీయేకు ఓటు వేసి గెలిపిస్తే దేశంలోని ప్రతి ఒక్క చొరబాటుదారుని వెనక్కి పంపించి తీరుతామని హామీ ఇచ్చారు.
బిహార్‌లోని సహర్సాలో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో తేజస్వి మాట్లాడుతూ, అత్యంత వెనుకబడిన తరగతుల వాణిని వినిపించేందుకు ముఖేష్ సాహ్నీ డిప్యూటీ సీఎంగా ఉంటారని, ఆయనతో పాటు వివిధ సామాజిక వర్గాలకు చెందిన మరింత మంది ఉప ముఖ్యమంత్రులుగా ఉంటారని చెప్పారు.
విపక్ష మహాఘట్‌బంధన్‌పై ప్రధాని విమర్శలు గుప్పిస్తూ, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం ఏళ్ల తరబడి బిహార్‌ను లూటీ చేసిందని, ఇప్పుడు వీరంతా బెయిలుపై ఉన్నారని చెప్పారు.
శ్వేతాసుమన్ 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని చౌందౌలి జిల్లావాసిగా నామినేషన్ పత్రంలో పేర్కొన్నారు. అయితే 2025 ఎన్నికల్లో బిహార్ నివాసిగా పేర్కొన్నారు.
బిహార్‌లో గత ప్రభుత్వాల హయాంలో శాంతిభద్రతులు, విద్య, మౌలిక వసతులు దయనీయంగా ఉండేవని, తమ నాయకత్వంలో బీహార్‌లో గణనీయంగా మార్పులు చోటుచేసుకున్నాయని నితీష్ కుమార్ చెప్పారు. మెరుగైన రోడ్లు, విద్యుత్, శాంతిభద్రతలు, ప్రజల మధ్య సామరస్యం పాదుకొల్పామని అన్నారు.
జీవికా సీఎం (కమ్యూనిటీ మొబిలైజర్స్)లకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పిస్తామని, రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మనెంట్ గా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకుంటామని తేజస్వి యాదవ్ వాగ్దానం చేశారు.