Home » Bihar Elections 2025
వివిధ నియోజకవర్గాల్లో పలువురు నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉండటం, పార్టీ నామినీలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టు వస్తున్న వార్తలతో క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్టు ఆర్జేడీ ప్రధాన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
మోకామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీయూ అభ్యర్థిగా సింగ్ పోటీ చేస్తున్నారు. ఆయనపై ఆర్జేడీ అభ్యర్థి వీణాదేవి, జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి ప్రియదర్శి పీయూష్ పోటీలో ఉన్నారు. మోకామా 2005 నుంచి సింగ్‌కు కంచుకోటగా ఉంది.
నితీష్ కుమార్ 20 ఏళ్ల పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, రాష్ట్ర యంత్రాంగం అవినీతిమయమైందని, శాంతిభద్రతలు లోపించాయని తేజస్వి ఆరోపించారు. సీమాంచల్ ప్రాంతాన్ని ఎన్డీయే ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.
స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, అశోక్ గెహ్లాట్ వంటి ప్రముఖులు ఉన్నారు. సచిన్ పైలట్, భూపేష్ బఘేల్, గౌరవ్ గొగోయ్, కన్హయ్య కుమార్, జిగ్నేష్ మేవాని, దిగ్విజయ్ సింగ్, రణ్‌జీత్ రంజన్, తారిఖ్ అన్వర్ తదితరులు కూడా ఈ జాబితాలో చోటుచేసుకున్నారు.
పార్టీ అధికార ప్రకటన ప్రకారం, బహిష్కరణ వేటు పడిన నేతల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గోపాల్ మండల్, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ సంజీవ్ శ్యామ్ సింగ్, మాజీ మంత్రి శైలేష్ కమార్, మాజీ ఎమ్మెల్సీ సంజయ్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
సీతామర్హిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ, ఇది జన్ సురాజ్ జన్మభూమి అని, మూడేన్నరేళ్ల క్రితం పార్టీ పుట్టిందని చెప్పారు. భయంతో బీజేపీకో, లాలూకో ఓటు వేయాల్సిన పనిలేదని, బిహార్‌లో రాజకీయ వెట్టిచాకిరీకి తాము ముగింపు పలకాలని తమ పార్టీ గట్టిగా తీర్మానించుకుందని తెలిపారు.
ఖగరియాలో శనివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా మాట్లాడుతూ, జేడీయూ నేత నితీష్ కుమార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు మాత్రమే బిహార్ అభివృద్ధిని కాంక్షిస్తుంటారని చెప్పారు. నితీష్ పాలనలో నేరాలు తగ్గాయని, నక్సలిజం నుంచి బిహార్‌కు విముక్తి కల్పించేందుకు ఎన్డీయే కృషి చేస్తోందని చెప్పారు.
తొలుత 15 సీట్లలో మహాకూటమి అభ్యర్థులు ఒకరితో మరొకరు తలపడుతూ నామినేషన్ల వేశారు. దీంతో గందరగోళం నెలకొంది. గురవారంనాడు జరిగిన మహాకూటమి నేతల మీడియా సమావేశంలో షీట్ల షేరింగ్ వివరాలను వెల్లడిస్తారనే ఊహాగానాలు వెలువడినప్పటికీ దానిపై ఎలాంటి ప్రకటన చేయకుండానే సమావేశం ముగిసింది.
ఆర్జేడీ జంగిల్ రాజ్‌కు ఎన్డీయే స్వస్తి చెప్పి రాష్ట్రంలో సుపరిపాలన తెచ్చిందని మోదీ అన్నారు. ఆర్జేడీ-కాంగ్రెస్ హయాంలో పెట్టుబడిదారులు రాష్ట్రం విడిచిపెట్టి పోయారని, ఉద్యోగాల పేరుతో భూములు లాక్కున్న వాళ్లు యువతకు ఉద్యోగాలు ఇచ్చిందే లేదని విమర్శించారు.
చొరబాటుదారులను సివాన్‌లో ఉండనీయాలని రాహుల్ గాంధీ చెబుతున్నారని, అయితే తాను చాలా స్పష్టంగా ఒకమాట చెబుతున్నానని అమిత్ షా అన్నారు. ఎన్డీయేకు ఓటు వేసి గెలిపిస్తే దేశంలోని ప్రతి ఒక్క చొరబాటుదారుని వెనక్కి పంపించి తీరుతామని హామీ ఇచ్చారు.