Home » Bengaluru
మైసూరు, చామరాజనగర జిల్లాల్లో పులుల దాడుల్లో ఆదివారం ఒకే రోజున ఇద్దరు రైతులు మృతి చెందిన ఘటనలతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవలి కొంతకాలంగా రెండు జిల్లాల పరిధిలో పలు గ్రామాల్లో పులుల దాడితో పశువులు, గొర్రెలను రైతులు కోల్పోయారు.
కన్నడ నటి దివ్య సురేశ్ పై హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఈమె కన్నడ బిగ్ బాస్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. ఈ నెల 4వ తేదీన అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో బైతరాయణపురలోని ఎంఎం రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది.
కొద్ది రోజులుగా బెంగళూరు రోడ్ల పరిస్థితిపై కిరణ్ మజుందార్, డీకే శివకుమార్ మధ్య మాటల యుద్ధం సాగుతూ వచ్చింది. బెంగళూరు రోడ్లు, చెత్తతో తాను ఇబ్బందులు పడినట్టు ఒక విదేశీ విజిటర్ చేసిన వ్యాఖ్యలపై మజుందార్ స్పందించడం చర్చనీయాంశమైంది.
ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ బెంగళూరు ఆఫీస్‌లో షాకింగ్ ఘటన జరిగింది. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ఓ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు 28 పేజీల మరణ వాంగ్మూలం రాశాడు. దీంతో ఓలా సంస్థ సీఈవో భవీశ్ అగర్వాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
చెత్త కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని, దేశలోని ప్రధాన నగరాల్లోని ఏ మున్సిపాలిటీ దీనిని పరిష్కరించడం లేదని, ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ఈ చెత్త సమస్య దయనీయంగా ఉందని మజుందార్ ఇటీవల ట్వీట్ చేశారు.
కర్ణాటక వెనుకబడి తరగతుల కమిషన్ చేపట్టిన 'సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ సర్వే'లో పాల్గొన రాదని నారాయణ మూర్తి దంపతులు నిర్ణయం తీసుకున్నారు. ఎన్యూమరేషన్ కోసం ఆ దంపతుల ఇంటికి వెళ్లినప్పుడు తమకు సర్వే అక్కర్లేదని చెప్పినట్టు అధికారులు తెలిపారు.
తన కూతుర్ని చూసుకోవడానికి అశ్లమోవా ఓ ఆయాను పెట్టుకుంది. ఆ ఆయాకు ఏకంగా 45 వేల రూపాయలు జీతం ఇస్తోంది. అది కూడా పార్ట్‌టైం పని కోసం ఇంత పెద్ద మొత్తం చెల్లిస్తోంది.
దక్షిణకన్నడ జిల్లా కేంద్రం మంగళూరులోనూ వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించేందుకు ప్రభుత్వం భూమిని మంజూరు చేసిందని టీటీడీ బోర్డు సభ్యుడు నరే్‌షకుమార్ అన్నారు. బెంగళూరు వయ్యాలికావల్‌లోని టీటీడీ ఆలయంలో గురువారం 2026 ఏడాదికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను ఆయన విడుదల చేశారు.
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు కర్ణాటక ప్రభుత్వం రంగంలోకి దిగింది. బెంగళూరు బిజినెస్ కారిడార్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
బస్ అత్యంత వేగంగా ముందున్న ఆటోలు, కార్లు, బైకులను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయింది. కండెక్టర్ చాలా కష్టపడి బస్‌ను ఆపాడు. లేదంటే మరిన్ని వాహనాలను బస్ ధ్వంసం చేసేది.