Big Twist In Ganavi Case: గానవి కేసులో ఊహించని ట్విస్ట్.. ఆత్మహత్య చేసుకున్న భర్త..
ABN , Publish Date - Dec 27 , 2025 | 05:00 PM
భార్యాభర్తలిద్దరూ హనీమూన్ కోసం శ్రీలంక వెళ్లారు. అక్కడ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. గానవి పెళ్లికి ముందు ఓ వ్యక్తిని ప్రేమించింది. ఈ విషయమై సూరజ్ భార్యను ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.
కొత్త పెళ్లి కూతురు గానవి కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. గానవి భర్త సురాజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అంతేకాదు.. అతడి తల్లి కూడా ఆత్మహత్యకు ప్రయత్నించటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ సంగతేంటంటే.. బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల గానవికి అదే ప్రాంతానికి చెందిన సురాజ్‌తో రెండు నెలల క్రితం పెళ్లయింది. భార్యాభర్తలిద్దరూ హనీమూన్ కోసం శ్రీలంక వెళ్లారు. అక్కడ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. గానవి పెళ్లికి ముందు ఓ వ్యక్తిని ప్రేమించింది. ఈ విషయమై సూరజ్ భార్యను ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అది చినికి చినికి గాలి వానలా మరింది.
హనీమూన్ మధ్యలోనే గానవి బెంగళూరుకు వచ్చేసింది. నేరుగా పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడ ఆత్మహత్యకు యత్నించింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, సరైన వైద్యం అందకపోవటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గానవి కన్నుమూసింది. గానవి సూసైడ్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సూరజ్‌తో పాటు అతడి కుటుంబసభ్యుల్ని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తల్లి జయంతి, సోదరుడు సంజయ్‌తో కలిసి నాగ్‌పూర్ వెళ్లిపోయాడు. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం..
గానవి ఆత్మహత్య చేసుకోవటానికి కారణం సూరజ్ అని ఆరోపిస్తూ గానవి కుటుంబసభ్యులు అతడిపై యుద్ధం ప్రకటించారు. అతడిని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. వారి వేధింపులు రోజురోజుకు ఎక్కువవటంతో సూరజ్ తట్టుకోలేకపోయాడు. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అతడి తల్లి జయంతి కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గొడవల కారణంగా నెల రోజుల వ్యవధిలో రెండు ప్రాణాలు పోవటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి
ఇది మృత్యువుతో ఆడుకోవడం కాక మరేంటి.. ఈ మహిళల ప్రమాదకర విన్యాసం చూస్తే..
పెళ్లిలో ఊహించని సంఘటన.. భర్తను ముద్దు పెట్టుకున్న మాజీ ప్రియురాలిపై..