Church Street Pub: బెంగళూరులోని చర్చ్ స్ట్రీట్‌లో ఘర్షణ.. కొట్టుకున్న మందుబాబులు
ABN , Publish Date - Jan 01 , 2026 | 01:30 PM
న్యూ ఇయర్ వేడుకలు హ్యాపీగా జరుపుకుంటున్న సందర్భంగా ఒక పబ్‌లో చెలరేగిన గొడవ తీవ్ర ఉద్రిక్తకు దారి తీసింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఏం చేశారంటే..
దేశ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఎంతో హ్యాపీగా జరుపుకున్నారు. ఒక వైపు ఎంజాయ్‌మెంట్.. మరోవైపు ఘర్షణలు, విషాదాలు చోటు చేసుకున్నాయి. బెంగుళూర్ లోని ఒక పబ్‌లో ఘర్షణ చెలరేగడంతో యువకులు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బెంగుళూరు నగరంలోని చర్చి స్ట్రీట్ ప్రాంతంలోని ఫేమస్ నైట్‌లైఫ్ హబ్‌లో జరిగిన న్యూ ఇయర్ వేడుకలకు భారీగా జనం తరలి వచ్చారు. వేడుకలు జరుగుతున్న సమయంలో కొంతమంది యువకులు మ్యదం మత్తులో గొడవ చేయడం ప్రారంభించారు. పబ్‌లోకి ఎంట్రీ విషయంలో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. అక్కడ ఉన్న మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించడంతో గొడవ ముదిరిపోయింది. పబ్ సిబ్బంది, యువకులు పొట్టు పొట్టు కొట్టుకోవడంతో అక్కడ ఉద్రక్తత పరిస్థితి నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘర్షన పడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణకు కారణమైన వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. చర్చ్ స్ట్రీట్, బ్రిగేడ్ రోడ్ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను పూర్తిగి నిలిపివేసి, కేవలం పాదాచారులకు మాత్రమే పరిమిషన్ ఇచ్చారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బెంగుళూరు వ్యాప్తంగా20 వేల మందికి పైగా పోలీసులు, డ్రోన్లు, బాడీ కెమెరాలతో నిఘా ఉంచినట్లు సమాచారం.
ఇవీ చదవండి..