Nurse Lover News: ప్రియుడిని బెదిరించిన ప్రియురాలు.. కట్ చేస్తే ఊహించని దారుణం..
ABN , Publish Date - Dec 26 , 2025 | 06:52 PM
ఓ వ్యక్తి తన ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. పెళ్లి చేసుకోమంటూ బెదిరింపులకు దిగుతోందన్న పగతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లోకి చొరబడి మరీ ఆమె ప్రాణాలు తీశాడు.
ఈ మధ్య కాలంలో ప్రేమ వ్యవహారాలు బాగా బెడిసి కొడుతున్నాయి. హత్యలకు దారి తీస్తున్నాయి. తాజాగా, ఓ వ్యక్తి తన ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. పెళ్లి చేసుకోమంటూ బెదిరింపులకు దిగుతోందన్న పగతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లోకి చొరబడి మరీ ఆమె ప్రాణాలు తీశాడు. ఈ సంఘటన కర్ణాటకలో బుధవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని కుమారస్వామి లే అవుట్‌కు చెందిన మమతా అనే యువతి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది.
ఆమెకు కొన్ని నెలల క్రితం సుధాకర్ అనే యువకుడితో పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. మమత వయసులో తనకంటే పెద్ద అని సుధాకర్‌కు తెలీదు. ఈ విషయం తెలియగానే ఆమెను దూరం పెట్టాడు. ఇదే సమయంలో సుధాకర్ ఇంట్లో వాళ్లు అతడికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. అమ్మాయిని చూశారు. ఆమెను పెళ్లి చేసుకోవాలంటూ సుధాకర్‌పై కుటుంబసభ్యులు ఒత్తిడి తెచ్చారు. దీంతో అతడు వారి మాటకు తలొగ్గాడు. ఇంట్లో వాళ్లు చూపించిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం మమతకు తెలిసింది. ఆమె తీవ్ర ఆగ్రహానికి గురైంది.
‘నన్ను కాకుండా వేరే వాళ్లను పెళ్లి చేసుకుంటే నిన్ను ఊరికే వదిలిపెట్టను. నేను ఆత్మహత్య చేసుకుని నా చావుకు నువ్వు.. నీ కుటుంబం కారణం అని సూసైడ్ నోట్ రాస్తా’ అంటూ బెదిరింపులకు దిగింది. మమత బెదిరింపులతో సుధాకర్ ఆగ్రహానికి గురయ్యాడు. ఎలాగైనా ఆమె అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశాడు. డిసెంబర్ 24వ తేదీన మమత ఇంటికి వెళ్లాడు. ఆమెను దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మమత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో మమత హత్యకు కారణం సుధాకర్ అని తెలియవచ్చింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మద్యం మత్తులో భర్తను చంపిన భార్య.. గొడ్డలితో 26 వేట్లు..
ఫారెస్ట్ అధికారిపై అడవి పంది దాడి.. కాపాడ్డానికి వెళితే..