Wife Kills Husband: మద్యం మత్తులో భర్తను చంపిన భార్య.. గొడ్డలితో 26 వేట్లు..
ABN , Publish Date - Dec 26 , 2025 | 06:26 PM
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో ఓ మహిళ తన భర్తను అత్యంత కిరాతకంగా చంపేసింది. గొడ్డలితో 26 వేట్లు వేసి ప్రాణాలు తీసింది.
లఖ్‌నవూ, డిసెంబర్ 26: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో ఓ మహిళ తన భర్తను అత్యంత కిరాతకంగా చంపేసింది. గొడ్డలితో 26 వేట్లు వేసి ప్రాణాలు తీసింది. యూపీ బితూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిక్ర గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన సంచలన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
తిక్ర గ్రామానికి చెందిన రవిశంకర్(45), వీరాంగన భార్యభర్తలు. వీరికి నాలుగేళ్ల కుమారుడు జైన్ ఉన్నాడు. ఈ దంపతులు నిత్యం గొడవలు పడుతుండేవారు. ఈ క్రమంలో రవిశంకర్, వీరాంగన వేరు వేరుగా జీవనం సాగిస్తున్నారు. రవిశంకర్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుండగా.. అతని భార్య వీరాంగన అదే గల్లీలో తన కొడుకు జైన్‌తో కలిసి ఉంటుంది. అయినప్పటికీ.. సాయంత్రం అయితే చాలు రోజూ తాగివచ్చి ఇరువురూ తమ ఇంటి వద్ద గొడవపడేవారు. ఈ క్రమంలో తాజాగా కూడా వీరిద్దరూ ఫుల్లుగా మద్యం తాగి ఇంటికి వచ్చారు. ఇద్దరి మధ్య మళ్లీ ఘర్షణ మొదలైంది. మాటా మాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. రవిశంకర్ రోకలితో వీరాంగనను తలపై కొట్టాడు. ఆ తరువాత వీరాంగన తన చేతికి అందిన గొడ్డలిని తీసుకుని రవిశంకర్‌పై దాడి చేసింది. గొడ్డలి బలంగా తగలడంలో అతను అక్కడే పడిపోయాడు. అయినప్పటికీ ఆగకుండా వీరాంగన 26 సార్లు గొడ్డలితో దాడి చేసింది. దీంతో తీవ్ర రక్త స్త్రావంతో రవిశంకర్ కుప్పకూలిపోయాడు.
భర్తపై దాడి చేసిన వీరాంగన.. ఆ తరువాత తనకేమీ తెలియదన్నట్లుగా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. తన భర్త కింద పడి గాయపడ్డాడని, తీవ్ర రక్తస్త్రావం అవుతోందంటూ విలపించింది. బంధువులు ఇంటికి చేరుకోగా.. ఆ సమయంలో వీరాంగన రక్తపు మరకలను తుడిచేస్తూ కనిపించింది. దీంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కొన ప్రాణాలతో ఉన్న రవిశంకర్‌ను ఆస్పత్రికి తరలించారు. అతని భార్యను అదుపులోకి తీసుకున్నారు. అయితే, రవిశంకర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
వైద్యులు పోస్టుమార్టం చేయగా అతని శరీరంపై 26 గొడ్డలి వేట్లు ఉన్నట్లు గుర్తించారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలైన వీరాంగనను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బితూర్ ఎస్‌హెచ్‌ఓ ప్రేమ్ నారాయణ్ విశ్వకర్మ మాట్లాడుతూ.. భార్యాభర్తలు ఇద్దరూ మద్యం సేవించారని, ఆ తరువాత వీరిద్దరి మధ్య గొడవ జరిగిందన్నారు. ఈ క్రమంలోనే వీరాంగన తన భర్తను గొడ్డలితో నరికి చంపేసిందన్నారు. అయితే, రవిశంకర్‌పై దాడి చేసిన గొడ్డలి కనిపించకుండా మాయం చేసిందని, దానిని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
ఫారెస్ట్ అధికారిపై అడవి పంది దాడి.. కాపాడ్డానికి వెళితే..
ఏపీలో పలువురు మున్సిపల్ కమిషనర్లు బదిలీ
బాబోయ్.. అక్షరాలా రూ. 2.54 లక్షలకు చేరిన వెండి ధర..