Home » Bangladesh
అండర్ 19 ప్రపంచ కప్ 2026లో చోటు చేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల కుర్రాళ్లు కీలక పోరులో తలపడుతున్నారు. అయితే.. టాస్ సమయంలో భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రే, బంగ్లా వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్ పరస్పరం షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్, ఆర్థిక సంఘ ఛైర్మన్ నజ్ముల్ ఇస్లాం బుధవారం బంగ్లా ప్లేయర్లపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆగ్రహించిన ప్లేయర్లు.. నజ్ముల్‌ను బోర్డు నుంచి తొలగించకపోతే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్), అంతర్జాతీయ మ్యాచ్‌లను బహిష్కరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తాజాగా వారి డిమాండ్స్ కు తలొగ్గిన బీసీబీ.. నజ్ముల్ ను తొలగించింది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీకి చెందిన కీలక నేతల్లో ప్రొలొయ్ ఒకరు. హిందూ రాజకీయ నాయకుడిగా ఆయనకు మంచి పేరుంది. అవామీ లీగ్ పబ్న జిల్లా యూనిట్‌కు కల్చరల్ ఎఫైర్స్ సెక్రటరీగా పని చేశారు..
హిందువులే టార్గెట్‌గా బంగ్లాదేశ్‌లో హత్యలు జరుగుతున్నాయి. తాజాగా, సమీర్ దాస్ అనే యువకుడిని గుర్తు తెలియని దుండుగులు దాడి చేసి చంపేశారు. ఈ సంఘటన చిట్టగ్యాంగ్‌లోని దగన్‌బుయ్యాలో చోటుచేసుకుంది..
ఆదివారం వడోదర వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. ఇందులో బంగ్లాదేశ్ అంపైర్ సర్ఫుద్దౌలా సైకత్ విధులు నిర్వహించడం చర్చనీయాంశం అయింది. ఈ విషయంపై బీసీబీ తాజాగా స్పందించింది. అతడికి బీసీబీకి సంబంధం లేదని తేల్చి చెప్పింది.
భద్రత కారణాల దృష్ట్యా రానున్న టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌లో బంగ్లా ఆడనున్న మ్యాచ్‌ల వేదికలు మార్చాలంటూ బీసీబీ.. ఐసీసీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. బీసీబీ అభ్యర్థనను ఐసీసీ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఈ అంశంపై ఐసీసీ.. బంగ్లా క్రికెట్ బోర్డుకు ఓ కీలక సూచన చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై వరుసగా జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. హిందువుల ఇళ్లపై, వ్యాపార సంస్థలపై కొంతమంది అతివాదులు దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో ఇప్పటికే పలువురు హిందువులు చనిపోయారు.
బంగ్లాదేశ్-భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్ అసలు టీ20 వరల్డ్ కప్ ఆడుతుందా? లేదా? అనే విషయంలో ఓ క్లారిటీ అంటూ లేదు. ఈ నేపథ్యంలో బంగ్లా క్రికెట్ జట్టు సభ్యుడు, స్టార్ ఆల్‌రౌండర్ మహేదీ హసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
బంగ్లా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌పై బీసీబీ సభ్యుడు నజ్ముల్ ఇస్లామ్ సంచలన ఆరోపణలు చేశాడు. సోషల్ మీడియా వేదికగా ‘ఇండియన్ ఏజెంట్’ అని నిందించాడు. ఐసీసీ నుంచే 95 శాతం వరకు బంగ్లా క్రికెట్‌కు నిధులు వస్తాయని.. బీసీబీ జాగ్రత్తగా వ్యవహరించాలని తమీమ్ సూచించిన విషయం తెలిసిందే.
భారత్‌తో శత్రుత్వం పాటిస్తున్న పొరుగుదేశం బంగ్లాదేశ్ క్రమంగా పాకిస్థాన్‌కు చేరువ అవుతోంది. షేక్ హసీనా పాలన ముగిసిన తర్వాత బంగ్లా అనేక రంగాల్లో పాక్‌తో సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి.