Home » Bandi Sanjay Kumar
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసులో బాధితురాలికి న్యాయం చేయాలని మాత్రమే తాను మాట్లాడానని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ కేసులో బాధితురాలికి న్యాయం చేసే అంశంపైనే తాను మాట్లాడానని.. తన మాటలను కొంతమంది వక్రీకరించారని పేర్కొన్నారు.
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఖండించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసు వ్యవహారంలో మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడి కేసులో ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.
పశ్చిమబెంగాల్‌లో ఎన్నో అరాచకాలు జరిగాయని.. బంగ్లా చొరబాటు దారులకు దారులు మూసుకుపోయాయని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. దేశం అంతా బీజేపీని కోరుకుంటోందని ఉద్ఘాటించారు.
కేంద్ర జల్‌శక్తి మంత్రికి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్‌కు కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలది రాహుకేతు గ్రహమని బండి సంజయ్ అంటున్నారని.. అసలు బండి సంజయ్ ఏ గ్రహమని ఎద్దేవా చేశారు.
భారత ప్రజాస్వామ్యానికి ఏప్రిల్ 17 చీకటి రోజని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి తల్లి, అక్కా, చెల్లి, కుమార్తెకు ఈరోజు అవమాన దినమని పేర్కొన్నారు.
నాసిక్‌లో జరిగిన ‘లవ్ జిహాద్’ ఆరోపణల కేసు నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేశారు.
ప్రముఖ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘనంగా నివాళులర్పించారు. అణచివేతపై తిరుగుబాటుకు కేరాఫ్ అడ్రస్.. బడుగు, బలహీన వర్గాలకు కొండంత ధైర్యం... మహాత్మా జ్యోతి రావు పూలే అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. అంకెల ఆర్భాటాలు, కేటాయింపుల ప్రగల్భాలే తప్ప ఒరిగిందేమీ లేదని వ్యాఖ్యలు చేశారు.