Home » Assembly elections
బిహార్‌లో 22 ఏళ్ల తర్వాత ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను ఎలక్షన్ కమిషన్ నిర్వహించింది. గత ఆగస్టు 1న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించింది. సెప్టెంబర్ 1వ తేదీలోగా వ్యక్తులు, రాజకీయ పార్టీలకు తమ క్లెయిమ్స్, అభ్యంతరాలు తెలియజేసుకునే అవకాశం కల్పించింది.
అక్టోబర్ 4,5 తేదీల్లో రెండ్రోజుల పాటు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పాట్నాలో పర్యటిస్తారు
అన్ని పార్టీలతోనూ డీఎండీకే స్నేహపూర్వకంగానే మెలగుతోందని, అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పొత్తుపై చర్చించేందుకు ఇప్పటి వరకు ఏ కూటమి నుంచి కూడా తమకు ఆహ్వానం అందలేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత అన్నారు.
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ధీమా వ్యక్తం చేశారు. మాజీ సీఎం, ప్రతిపక్షనేత ఈపీఎస్ ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో చేపట్టిన ప్రచారయాత్ర శుక్రవారం కరూర్ జిల్లాలోని అరవకురిచ్చి అసెంబ్లీ నియోజకవర్గం మీదుగా సాగింది.
తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేత విజయ్(Vijay)కి రాజకీయాలంటే ఏమిటో తెలియవని, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలే ఆయనకు తగిన గుణపాఠం చెబుతారని హాస్యనటుడు ఎస్వీ శేఖర్ అన్నారు. శుక్రవారం ఉదయం సచివాలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ మందవెళిపాక్కంలోని ఐదో క్రాస్ రోడ్డుకు రంగస్థల నటుడైన తన తండ్రి వెంకట్రామన్ పేరు పెట్టినందుకు ఈ సందర్భంగా సీఎం స్టాలిన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
బిహార్ సర్వతోముఖాభివృద్ధికి అంతికతమవుతూ, అందుకు సిద్ధంగా ఉన్నట్టు తేజ్‌ప్రతాప్ తెలిపారు. బిహార్‌లో మార్పును తీసుకువచ్చేందుకు కొత్త సిస్టమ్‌ను ఏర్పాటు చేయడం తమ లక్ష్యమని తెలిపారు.
వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా నూతన ఎన్నికల చార్జులను నియమించింది. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా, కేంద్ర సహాయమంత్రి మురళీధర్ మొహోల్‌లను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
డీఎంకే మాజీ మంత్రి, ఆ పార్టీ కరూరు జిల్లా ఇన్‌ఛార్జి సెంథిల్ బాలాజీ కాంగ్రెస్ సభ్యులకు డీఎంకే సభ్యత్వం కల్పించి పార్టీలో చేర్చుకోవడంపై ఆ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి ఆగ్రహం వ్యక్తం చేశా రు. కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య వైరం కొనసాగుతోం ది.
డీఎంకే కూటమిలోని ‘మక్కల్ నీదిమయ్యం’ (ఎంఎన్‌ఎం) ఈ సారి ఆచితూచి అడుగులేయాలని నిర్ణయించుకుంది. ‘ఇండియా’ కూటమిలో వున్న ఆ పార్టీ.. ఇప్పటికే తమకు మెరుగైన అవకాశాలున్న నియోజకవర్గాలను గుర్తించడంతో పాటు ఆ స్థానాలను డీఎంకే తమకు కేటాయించేలా ఒత్తిడి పెంచాలని భావిస్తోంది.
తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను ముఖ్యమంత్రి స్టాలిన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎంపిక చేస్తారని డీఎంకే ప్రిసీడియం కార్యదర్శి ఆర్‌ఎస్ భారతి పేర్కొన్నారు.