Share News

Bihar Assembly Elections: ఎన్డీయే సీట్ల షేరింగ్ ఫార్ములా ఇదేనా.. ఈరోజే కీలక ప్రకటన

ABN , Publish Date - Oct 12 , 2025 | 04:40 PM

విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, బిహార్‌లో ఎన్డీయే కూటమికి జేడీయూ నాయకత్వం వహిస్తుంది. 101 నుంచి 102 సీట్లలో ఆ పార్టీ పోటీ చేయనుంది. జేడీయూ కంటే ఒక సీటు తక్కువతో బీజేపీ పోటీ చేయనుంది.

Bihar Assembly Elections: ఎన్డీయే సీట్ల షేరింగ్ ఫార్ములా ఇదేనా.. ఈరోజే కీలక ప్రకటన
NDA Seat sharing formula ready

న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) సీట్ల పంపకాలకు (seats sharing) సంబంధించి సుదీర్ఘ మంతనాలు, సంప్రదింపుల అనంతరం ఎన్డీయే (NDA) అధికారిక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతోంది. ఎన్డీయేలో జేడీయూ, బీజేపీ, లోక్‌ జన్‌శక్తి పార్టీ (రామ్ విలాస్) హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్), రాష్ట్రీయ లోక్‌ మోర్చా భాగస్వాములుగా ఉన్నాయి. భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకాలపై బీజేపీ కోర్ గ్రూప్ సమావేశం ఆదివారంనాడు న్యూఢిల్లీలో జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో సుమారు 3 గంటల సేపు జరిగిన సమవేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సైతం పాల్గొన్నారు. సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన అధికారిక ప్రకటన సాయంత్రం వెలువడే అవకాశం ఉంది.


ఎవరెవరికి ఎన్నెన్ని?

విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, బిహార్‌లో ఎన్డీయే కూటమికి జేడీయూ నాయకత్వం వహిస్తుంది. 101 నుంచి 102 సీట్లలో ఆ పార్టీ పోటీ చేయనుంది. జేడీయూ కంటే ఒక సీటు తక్కువతో బీజేపీ పోటీ చేయనుంది. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ (రామ్‌ విలాస్) పార్టీకి 26 సీట్లు ఇవ్వచూపగా, జితిన్ రామ్ మాంఝీకి హెచ్ఏఎం (సెక్యులర్)కు 7 సీట్లు దక్కనున్నాయి. రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహ ఆర్ఎల్ఎం పార్టీ 6 స్థానాలు ఇవ్వచూపారు.


మహాకూటమి మల్లగుల్లాలు

ఎన్డీయే భాగస్వాముల మధ్య సీట్ల సంపకాలు దాదాపు కొలిక్కిరాగా, విపక్ష మహాకూటమి (ఇండియా కూటమి) మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. మహాకూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) భాగస్వాములుగా ఉన్నాయి. కాంగ్రెస్ 70 సీట్లలో పోటీ చేసేందుకు పట్టుదలగా ఉండగా, 52-55 సీట్లు ఇచ్చేందుకు ఆర్జేడీ ప్రతిపాదించినట్టు సమాచారం.


ఇవి కూడా చదవండి..

ఆడపిల్లలు రాత్రివేళల్లో కాలేజీ బయటకు వెళ్లకూడదు... మమత వ్యాఖ్యలపై దుమారం

ఆపరేషన్ బ్లూస్టార్ పెద్ద పొరపాటు.. చిదంబరం సంచలన వ్యాఖ్యలు

For More National News And Telugu News

Updated Date - Oct 12 , 2025 | 04:41 PM