Home » Assembly elections
ఎన్నికల కోడ్ నేపథ్యంలో రూ.9 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు రోడ్ నంబర్ 5లోని మెట్రోస్టేషన్ వద్ద ఎస్‌ఐ జగదీష్ ఆధ్వర్యంలో గురువారం వాహన తనిఖీలు చేపట్టారు.
మదురై నుంచి ఈనెల 12న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నయినార్ నాగేంద్రన్ ‘తమిళగం నిమిర తమిళనిన్ పయనం’ పేరుతో చేపట్టనున్న ప్రచారానికి నగర పోలీసు శాఖ అనుమతులు జారీచేసింది.
నాలుగేళ్లుగా గవర్నర్‌తో రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతూనే ఉందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన తిరుచ్చి శ్రీరంగం శాసనసభ నియోజకవర్గ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఉదయనిధి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయన్నారు.
కరూర్ రోడ్‌షోలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది కుటుంబీకులను పరామర్శించేందుకు తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ తగు సన్నాహాలు చేపడుతున్నారు. ఆ దిశగా ఆయన తరఫు న్యాయవాదులు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.
జూబ్లీహిల్స్ శాసనసభ ఉపఎన్నికకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ప్రజలకు కీలక సూచన చేశారు.
కరూర్ తొక్కిసలాట ఘటనతో తీవ్రంగా నష్టపోయిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే).. నష్టనివారణ చర్యలకు దిగిందా?.. అధికార డీఎంకేను ఒంటరిగా అడ్డుకోవడం కష్ట సాధ్యంగా మారడంతో.. అన్నాడీఎంకేతో చేతులు కలిపేందుకు సిద్ధమైందా?.. ఆ పార్టీ అధినేత విజయ్ ఆదేశాల మేరకు క్రియాశీలక నేతలు.. అన్నాడీఎంకేతో మంతనాలు సాగిస్తున్నారా?.. అవుననే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ రాజకీయ వర్గాలు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ సోమవారం సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు.
243 మంది సభ్యుల ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22వ తేదీతో ముగియనుంది. ఈసారి కూడా ప్రధాన పోటీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీయే, ఆర్జేడీ తేజస్వి సారథ్యంలోని మహా ఘట్ బంధన్ మధ్యనే ఉంది.
ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్‌లో భాగంగా గతంలో 1500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ బూత్ ఉండగా, ఇప్పుడు దానిని 1,200 ఓటర్లకు ఒక బూత్‌గా నిర్ణయించామని సీఈసీ చెప్పారు. దీంతో అదనంగా 12,817 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఎలక్షన్ కమిషన్ టీమ్ మొత్తం రెండ్రోజులుగా బిహార్‌లోనే ఉందని, రాష్ట్ర పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల అధిపతులు, నోడల్ అధికారులతో సమావేశాలను నిర్వహించామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు.