Dy CM Udayanidhi: అర్హులైన గృహిణులకు డిసెంబర్ 15 నుంచి రూ.1000
ABN , Publish Date - Oct 17 , 2025 | 10:48 AM
రాష్ట్రంలో రెండో విడతగా అర్హులైన గృహిణులకు కలైంజర్ మహిళా సాధికార పధకం కింద ప్రతినెలా రూ.1000 చెల్లించనున్నట్లు ప్రత్యేక పథకాల అమలు మంత్రిత్వ శాఖను నిర్వర్తిస్తున్న ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి ప్రకటించారు.
- డిప్యూటీ సీఎం ఉదయనిధి
చెన్నై: రాష్ట్రంలో రెండో విడతగా అర్హులైన గృహిణులకు కలైంజర్ మహిళా సాధికార పధకం కింద ప్రతినెలా రూ.1000 చెల్లించనున్నట్లు ప్రత్యేక పథకాల అమలు మంత్రిత్వ శాఖను నిర్వర్తిస్తున్న ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) ప్రకటించారు. గురువారం ఉదయం శాసనసభలో ఆయన మాట్లాడుతూ... 2023 సెప్టెంబర్ 15న ప్రారంభమైన ఈ పథకానికి అపూర్వ స్పందన లభించిందని, గృహిణుల్లో ఆర్థిక పొదుపు పెరిగిందని, ఆ నగదును అత్యవసరాలకు, వైద్యచికిత్సలకు ఉపయోగిస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు జరిపిన సర్వేలలో వెల్లడైందని తెలిపారు.

రాష్ట్రమంతటా 1.14 లక్షల మంది గృహిణులు ఈ పథకం ద్వారా లబ్దిపొందుతున్నారని, ప్రభుత్వం రూ.30వేల కోట్లను ఈ పథకానికి వ్యయం చేసిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకానికి విధించిన కొన్ని నిబంధనలను ముఖ్యమంత్రి స్టాలిన్ సడలించారని, ఆ మేరకు కొత్తగా 28లక్షల మంది గృహిణులు దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో అర్హులైన వారిని నవంబర్ 30లోగా ఎంపిక చేసి, డిసెంబర్ 15 నుండి రెండో విడతగా అర్హులైన గృహిణులందరికీ ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
Read Latest Telangana News and National News