Share News

Assembly elections: విజయ్‏కి హెచ్చరిక.. మా కూటమిలో చేరకుంటే మీ పార్టీ గల్లంతే..

ABN , Publish Date - Oct 22 , 2025 | 10:48 AM

వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అన్నాడీఎంకే కూటమిలో చేరకపోతే ఆ పార్టీ పత్తాలేకుండా పోతుందని మాజీ మంత్రి, శాసనసభాపక్ష ఉపనాయకుడు ఆర్బీ ఉదయ్‏కుమార్‌ హెచ్చరించారు.

Assembly elections: విజయ్‏కి హెచ్చరిక.. మా కూటమిలో చేరకుంటే మీ పార్టీ గల్లంతే..

- టీవీకే అధినేతకు ఆర్బీ ఉదయకుమార్‌ హెచ్చరిక

చెన్నై: వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అన్నాడీఎంకే కూటమిలో చేరకపోతే ఆ పార్టీ పత్తాలేకుండా పోతుందని మాజీ మంత్రి, శాసనసభాపక్ష ఉపనాయకుడు ఆర్బీ ఉదయ్‏కుమార్‌(RB Udayakumar) హెచ్చరించారు. మదురైలో దీపావళి వేడుకల్లో భాగంగా తెప్పకుళం ముక్తీశ్వరాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఆయన ‘అమ్మా చారిటబుల్‌ ట్రస్ట్‌’ తరఫున భక్తులకు అన్నదానం చేశారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించటమే ప్రధాన లక్ష్యంగా అన్నాడీఎంకే బీజేపీతో పొత్తు కుదుర్చుకుందని, త్వరలో మరిన్ని పార్టీలు తమ కూటమిలో చేరనున్నాయని చెప్పారు.


nani1.3.jpg

అన్నాడీఎంకే మెగా కూటమిలో టీవీకే చేరటానికి అనువైన సమయం ఇదేనన్న విషయాన్ని ఆ పార్టీ నేత విజయ్‌ గ్రహించాలని సూచించారు. అన్నాడీఎంకే కూటమిలో టీవీకే చేరకపోతే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ పార్టీ గల్లంతవుతుందని, డీఎంకే ఆ పార్టీని నాశనం చేయడం తథ్యమని ఆర్బీ ఉదయకుమార్‌ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో మెగాస్టార్‌ చిరంజీవి రాజకీయ పార్టీని ప్రారంభించినప్పుడు ఎన్నికల పొత్తుపై సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే రాజకీయాల్లో రాణించలేకపోయారని,


nani1.2.jpg

జనసేన నేత పవన్‌కళ్యాణ్‌ సరైన సమయంలో పొత్తుపై చక్కటి నిర్ణయం తీసుకోవడం వల్ల పార్టీ బాగుపడటమే కాకుండా ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టిన విషయాన్ని విజయ్‌ గుర్తు చేసుకుంటే మంచిదన్నారు. డీఎంకేను గద్దె దింపటానికే అన్నాడీఎంకే బీజేపీతో పొత్తు కుదుర్చుకుందని, మళ్ళీ రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి వస్తే టీవీకేకి పుట్టగతులుండవని, ఆ తర్వాత విజయ్‌ని ఆ దేవుడు కూడా కాపాడలేడని హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్ప తగ్గుదల.. మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆ జిల్లాలో స్కూళ్లకు సెలవు..!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 22 , 2025 | 10:48 AM