Bengaluru News: ఎంపీ రాఘవేంద్ర సంచలన కామెంట్స్.. ఆ ఎన్నికలకు ఇక్కడి నుంచి సొమ్ము
ABN , Publish Date - Oct 22 , 2025 | 12:17 PM
బిహార్ శాసనసభ ఎన్నికలకు కర్ణాటక నుంచి భారీగా నగదు సమకూరుస్తున్నారని శివమొగ్గ ఎంపీ బీవై రాఘవేంద్ర ఆరోపించారు. ఈ అంశంపై గడిచిన కొన్నిరోజులుగా రాష్ట్ర రాజకీయాలలో కొనసాగుతోంది.
- ఎంపీ రాఘవేంద్ర ఆరోపణ
- డీసీఎం డీకే శివకుమార్ ఆగ్రహం
బెంగళూరు: బిహార్ శాసనసభ ఎన్నికలకు కర్ణాటక నుంచి భారీగా నగదు సమకూరుస్తున్నారని శివమొగ్గ ఎంపీ బీవై రాఘవేంద్ర(Shivamogga MP BY Raghavendra) ఆరోపించారు. ఈ అంశంపై గడిచిన కొన్నిరోజులుగా రాష్ట్ర రాజకీయాలలో కొనసాగుతోంది. సుమారు 2వేల కోట్ల రూపాయలు సమకూర్చాలని అధిష్ఠానం అల్టిమేటం ఇచ్చిందని అందుకే ఇటీవల సీఎం మంత్రులకు విందు పేరిట టార్గెట్ ఇచ్చారని ప్రతిపక్షనేత అశోక్ ఘాటుగా విమర్శించిన విషయం విదితమే.
తాజాగా సోమవారం ఎంపీ రాఘవేంద్ర వ్యాఖ్యలపై డీసీఎం డీకే శివకుమార్(DCM DK Shivakumar) సున్నితంగా మందలించారు. బీజేపీ, జేడీఎస్‌లో కొంతమంది హిట్ అండ్ రన్ నేతలు ఉన్నారని వారి తరహాలో నీవెందుకు వ్యవహరిస్తావంటూ మందలించారు. అయితే ఐటీబీటీశాఖ మంత్రి ప్రియాంకఖర్గే ఎక్స్ ద్వారా మంగళవారం విరుచుకుపడ్డారు. హైకమాండ్‌కు సమర్పణమస్తు చేసిన గొప్ప బీజేపీదే అన్నారు. బీజేపీ హైకమాండ్‌కు రూ.1800 కోట్లు కప్పం ఇచ్చిన విషయం వేదికపైనే యడియూరప్ప,
దివంగత అనంతకుమార్ సంభాషణలో బహిరంగమైంది మరచిపోయారా... అంటూనే మరోసారి గుర్తు చేశామన్నారు. బీజేపీలో సీఎం పోస్టుకు రూ.2500 కోట్లు చెల్లించాలని, మంత్రి కావాలంటే రూ.60-70 కోట్లు ఇవ్వాలని బీజేపీ నాయకులు వ్యాఖ్యానించిన విషయాన్ని ప్రస్తావించారు. బీజేపీ నాయకులు మొదట తమ పార్టీని చక్కదిద్దుకోవాలని తర్వాత విమర్శలకు దిగాలన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్ప తగ్గుదల.. మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News