Home » Army
జమ్మూ కశ్మీర్‌లోని ఉరీ సెక్టార్ కమల్‌కోట్ ఆర్మీ క్యాంపులో ఘోర ప్రమాదం జరిగింది. గ్రనేడ్ పేలి ఇద్దరు జవాన్లు మృతి చెందారు..
మెదక్ జిల్లాలో ఆర్మీ ఉద్యోగి పొన్నం కుమార్ దారుణ హత్యకు గురయ్యారు. మెదక్ పట్టణంలోని మిలిటరీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
లద్దాఖ్‌లోని పర్వత ప్రాంతాల్లో ఓ హెలికాప్టర్ కూలిన ఘటనలో ముగ్గురు భారత సైనికాధికారులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయితే.. ఈ ఘటన అనంతరం ఆర్మీ అధికారి తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ భారత్‌పై దాడులు కొనసాగిస్తే ప్రపంచపటంలో పాకిస్థాన్ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. భౌగోళికంగా ఉండాలా లేక చరిత్రలో కలిసిపోవాలా అనేది పాకిస్థాన్ తేల్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.
భారత నౌకాదళ తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత నావికాదళ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి స్థానంలో స్వామినాథన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఐఈడీ పేలుడు ధాటికి ముగ్గురు జవాన్లు మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి.
భారత మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నవరణె తన అముద్రిత పుస్తకం 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పై నెలకొన్న వివాదంపై స్పందించారు. తనను అనవసరంగా ఈ వివాదంలోకి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచురితం కాని పుస్తకంలోని విషయాలను కోట్ చేసి తనను వివాదంలోకి లాగారని, అది సరైనది కాదని అన్నారు.
ఈశాన్య నైజీరియాలో పొరపాటున జరిగిన సైనిక వైమానిక దాడిలో 100 మందికి పైగా పౌరులు మృతిచెందారు. బోకో హరామ్ జిహాదీలను లక్ష్యంగా చేసుకున్న దాడి కాస్తా మిస్ ఫైర్ అయినట్లు స్థానిక మీడియా తెలిపింది.
విశాఖపట్నం ఐఎన్‌ఎ్‌స సిర్‌కార్స్ నేవల్ బేస్ ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరులోని సైనిక సంక్షేమ కార్యాలయంలో అవుట్‌రీచ్ ప్రోగ్రాం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన 50 మందికిపైగా నావికాదళ మాజీ సైనికులు, విడోలు, ఆధారితులు హాజరయ్యారు.
భారత సైన్యంలో అగ్నివీర్ (జనరల్/ టెక్నికల్) ఉద్యోగాల భర్తీకి పురుషుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యువజన సర్వీసుల శాఖ సెట్విజ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి డి.విశ్వేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన వారు వచ్చే నెల ఒకటిలోగా వెబ్‌సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.