Share News

కంటోన్మెంట్‌లోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కలకలం

ABN , Publish Date - Sep 01 , 2026 | 07:25 AM

కంటోన్మెంట్‌లోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కలకలం రేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉన్న ఆయుధాల గదిలో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు గది తాళం పగులగొట్టి 12 ఆయుధాలు ఎత్తుకెళ్లారు.

కంటోన్మెంట్‌లోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కలకలం
Madras Regiment

హైదరాబాద్, సెప్టెంబర్ 1: కంటోన్మెంట్‌లోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కలకలం రేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉన్న ఆయుధాల గదిలో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు గది తాళం పగులగొట్టి 12 ఆయుధాలు ఎత్తుకెళ్లారు. 4 ఏకే-47లు, 6 పిస్టళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్ చోరీకి గురయ్యాయి. దొంగలు ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రిని కూడా దోచుకెళ్లారు.


ఆదివారం రాత్రి ఈ చోరీ జరిగినట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. సోమవారం ఉదయం బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రక్షణ వ్యవహారం కావడంతో కేసు వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. మద్రాస్ రెజిమెంట్‌లోకి అనుమతి ఉన్న వ్యక్తులకు మినహా ఇతరులకు ప్రవేశం లేదు. దీంతో సిబ్బందే చోరీకి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


ఆయుధాలు బరువుగా ఉండటంతో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది చోరీలో పాల్గొని ఉండొచ్చని భావిస్తున్నారు. ఆయుధాల గది వరకు వచ్చిన వారిపై పోలీసులు, ఆర్మీ అధికారులు ఆరా తీస్తున్నారు. రెజిమెంట్ పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఆర్మీ అధికారులు సిబ్బందిని అంతర్గతంగా విచారిస్తున్నారు. మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి

కౌన్సెలింగ్‌ సమయంలో కాలేజీల షిఫ్టింగ్‌

సెప్టెంబరులోనూ తక్కువ వర్షపాతమే!

Updated Date - Sep 01 , 2026 | 07:31 AM