Home » AP Politics
వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పై ఏపీ హైకోర్ట్ సీరియస్ అయింది. మహిళా ఎమ్మెల్యేపై ఆ వ్యాఖ్యలు ఏంటి? అని నిలదీసింది. మాజీ ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యేకు ఇచ్చే గౌరవం ఇదేనా?
ఏపీలో ఓపీ, ఐపీ సేవలు భారీగా పెరిగాయని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సూపర్ స్పెషాలిటీలో 59శాతం వేకెన్సీలు ఉన్నాయని చెప్పారు. టెలి మానస్లో భాగంగా మానసిక కౌన్సెలింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిత్య పంపకాలే అన్నది బహిరంగ రహస్యమే. అక్కడ కీలకమైన సబ్ రిజిస్ట్రార్ పోస్టుపైనే అందరి దృష్టి ఉంటుంది. అందులోనూ కీలకమైన కార్యాలయాల్లో ఆ పోస్టుకుండే డిమాండ్ అంతాఇంతా కాదు. అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ పోస్టు కూడా ఆ కోవలోకే వస్తుంది.
నియోజకవర్గంలో వైసీపీకి సమన్వయకర్తలేక కార్యకర్తల్లో అయోమయం ఏర్పడింది. పార్టీ కార్యక్రమాలు చేపట్టేవారు లేరు, సమస్య వస్తే అండగా నిలిచేవారూ కరువయ్యారు. దీంతో వైసీపీ క్యాడర్ బలహీనపడుతోందని ఆ పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఏపీలో అశాంతి సృష్టించేందుకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ కుట్రలు చేస్తున్నారని తెలుగుదేశం పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆరోపించారు. త్వరలోనే పేర్ని నాని జైలుకు పోతున్నారని చెప్పుకొచ్చారు. ఆ భయంతోనే రప్ప రప్ప అనే డైలాగులు చెబుతున్నారని మండిపడ్డారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పేర్నినానిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ మహిళను అడ్డం పెట్టుకుని ఆ ప్రాంతంలో కుట్రకు పేర్నినాని పాల్పడుతున్నారని మండిపడ్డారు.
గుడివాడ వివాదంపై మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని ఫోన్ సంభాషణ లీక్ అయింది. కూటమి నేత, వైసీపీ నేత మధ్య జరిగిన వాగ్వాదానికి కులం రంగు పులిమి వివాదం చేయాలని పేర్ని నాని ప్రయత్నం చేస్తున్నట్లు ఆ సంభాషణలో ఉంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదు సంవత్సరాలు వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. జగన్ హయాంలో ఏపీ ఎంతో నష్టపోయిందని విమర్శించారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి ఏఏఐబీ ప్రాథమిక నివేదిక వచ్చిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రాథమిక నివేదిక ద్వారా ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించలేమని తెలిపారు. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత వివరాలను వెల్లడిస్తామని అన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రప్పా రప్పా అనడంలో ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా మీ భాషా అదేనా అని మంత్రి డీబీవీ స్వామి ప్రశ్నించారు.