Share News

Home Minister Anitha: అప్పటి నుంచే.. జగన్ రెడ్డి పతనం ప్రారంభం అయ్యింది..

ABN , Publish Date - Sep 01 , 2025 | 09:03 PM

మూడు తరాల నాయకులతో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పని చేశారని హోం మంత్రి అనిత గుర్తు చేశారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను వైసీపీ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడును అన్యాయంగా జైల్లో పెట్టి వేధించిందని తెలిపారు.

Home Minister Anitha: అప్పటి నుంచే.. జగన్ రెడ్డి పతనం ప్రారంభం అయ్యింది..

పల్నాడు: స్త్రీని ఒక ఆట బొమ్మగా చూడకూడదు అని ఉచిత బస్సుకి సీఎం చంద్రబాబు స్త్రీశక్తి అని పేరు పెట్టారని హోంమంత్రి అనిత అన్నారు. ప్రభుత్వం మహిళల అభ్యన్నతి కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వానికి 2024 ఎన్నికల్లో మహిళలు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఇవాళ(సోమవారం) మీడియాతో మాట్లాడారు. మహిళలకు స్థానిక సంస్థలు ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని ధీమావ్యక్తం చేశారు.


మూడు తరాల నాయకులతో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పని చేశారని హోం మంత్రి అనిత గుర్తు చేశారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను వైసీపీ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడును అన్యాయంగా జైల్లో పెట్టి వేధించిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం అంటే గుర్తొచ్చే మాటలు.. ఇసుక, లిక్కర్ మాఫియా, బాబాయి గొడ్డలి పోటు అని విమర్శించారు. జగన్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియాలో టీడీపీ నేతల తల్లి, చెల్లిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టించారని మండిపడ్డారు. అసెంబ్లీలో ఎన్టీఆర్ కూతరుని అవమానించారని, అప్పటి నుంచే.. జగన్ రెడ్డి పతనం ప్రారంభం అయ్యిందని పేర్కొన్నారు.


రాజకీయంగా మచ్చ లేని వ్యక్తి చంద్రబాబు నాయుడుని హోం మంత్రి అనిత చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తిని గత వైసీపీ ప్రభుత్వం 53 రోజులు జైల్లో పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టారని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం పెంచిన ఫించన్ ఇవ్వడానికి 5 ఏళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యం అంటే ఏంటో మొన్న ఎన్నికల్లో చూసారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో గంజాయి స్కూల్ బ్యాగ్‌ల వరుకు వెళ్ళిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఈగల్ టీమ్ ద్వారా గంజాయి పండించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆమె స్పష్టం చేశారు.

Updated Date - Sep 01 , 2025 | 09:12 PM