Home » AP Politics
క్వార్ట్జ్ కుంభకోణం కేసు విచారణలో వైసీపీ ముఖ్య నేతల భాగోతాలు బయటకొస్తున్నాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భారీ అక్రమాలు బయటపడ్డాయి. మాజీ మంత్రులు అనిల్ కుమార్, కాకాణి గోవర్థన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు తీరుపై పార్లమెంట్‌లో మాట్లాడానని తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. ప్రతి పంటకు బీమా ఉండాలని, పంట నష్టం జరగకుండా చూడాలని కోరామని అన్నారు. వైసీపీ రైతు ప్రభుత్వమని చెప్పింది.. కానీ పూర్తిగా రైతులను మోసం చేసిందని ధ్వజమెత్తారు.
తెలుగుదేశం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన పనిచేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ‘సుపరిపాలనలో ముందడుగు’ అని తెలిపారు.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేతిలో రీజన్స్ ఫర్ అరెస్టు నివేదిక ఉంది. కోర్టులో 10 పేజీల రీజన్స్ ఫర్ అరెస్టు రిపోర్టు దాఖలు చేశారు సిట్ అధికారులు. లిక్కర్ స్కాం కేసులో మిథున్‌రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని అధికారులు తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు జగన్, వైసీపీ నేతలు ప్రజల గురించి ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు. గత జగన్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్ అయ్యారు. మిథున్‌రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. దీనిపై మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన సిట్..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలని.. లేకపోతే తాము తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు.
తమిళనాడులో పార్టీలు రాజకీయంగా విభేదించినా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పని చేస్తాయని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఇక్కడ మాత్రం స్వార్థ పూరిత ప్రతిపక్షo ఉండటం దురదృష్టకరమని..
ఏపీలో జరిగిన భారీ లిక్కర్ స్కాంపై ఈడీ చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. ఈ కేసులో వైసీపీ నేతల అవినీతి దేశ సరిహద్దులు దాటిందని విమర్శించారు. ఈ స్కాం దేశ సరిహద్దులు దాటించిన వైసీపీ నేతలకు గోల్డ్ మెడలు ఇవ్వాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉద్ఘాటించారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. తమ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే చంద్రబాబు నాయకత్వంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి పుంజుకుందని నొక్కిచెప్పారు.