Home » AP Politics
డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిట్ట. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఫ్యాన్ పార్టీ నేతలు పలుచన అవుతున్న క్రమంలోనే పలాయన వాదం అందుకున్నారు. అయితే, ఈ నేపథ్యంలోనే తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చంద్రబాబుకు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య గతంలో గొడవలు జరిగాయన్న విషయాన్ని ఇప్పుడు జగన్ అండ్ కో లేవనెత్తారు.
అత్యుత్తమ విధానాలతో ఏపీలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లిక్కర్ పాలసీ చాలా బాగుందని మంత్రి కందుల దుర్గేష్ ప్రశంసించారు. తమ ప్రభుత్వంలో ప్రజలకు నాణ్యమైన మద్యం అందిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ ఉద్ఘాటించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు జగన్ రావాలని... వారి పార్టీ నేతలు లాగా తాము అవహేళనగా మాట్లాడమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రప్పా రప్పా భాష మాట్లాడమని చెప్పుకొచ్చారు. జగన్ నిర్భయంగా అసెంబ్లీకి రావాలని అక్కడ నిజాలు చెప్పాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు.
జగన్ తన వ్యాఖ్యల ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారథి ప్రశ్నల వర్షం కురిపించారు. రౌడీలు, గంజాయి స్మగ్లర్లు, బెట్టింగ్ రాయుళ్ల ఇళ్లకు జగన్ వెళ్లడం పరామర్శా? ఎలా అవుతోందని నిలదీశారు. ఇలాంటి పరామర్శలు వైసీపీ ఉనికిలో ఉందని చెప్పుకోవడానికే కదా అని మంత్రి కొలుసు పార్థసారథి ప్రశ్నించారు.
బీఆర్ఎస్ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని.. గులాబీ నేతలు పబ్లిసిటీ కోసం మాత్రమే తమ ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. బీఆర్ఎస్ గాలి మాటలు తప్ప వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు.
గుడివాడ అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారని తెలుగుదేశం విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ ధ్వజమెత్తారు. అమర్నాథ్ లాగా తాము దిగజారి మాట్లాడమని పేర్కొన్నారు. దిగజారి మాట్లాడేవాళ్లను జగన్ ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. కేవలం కుల సమీకరణాల కోసమే గత వైసీపీ ప్రభుత్వం డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులను ఇచ్చిందని ఆక్షేపించారు.
తమ ప్రభుత్వంలో సూపర్ సిక్స్‌తో పాటు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉద్ఘాటించారు. అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, పథకాలకు యాభై వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. గత జగన్ ప్రభుత్వంలో రూ.1000లు పింఛన్ పెంచడానికే ఐదేళ్లు పట్టిందని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు.
తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోవాలనే దురుద్దేశాలు తమకు అప్పుడు, ఇప్పుడు లేవని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. తెలుగు ప్రాంతాలు, తెలుగు ప్రజలు బాగుండాలి అన్నది తెలుగుదేశం పార్టీ విధానమని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులు కట్టారని, తామేమైనా అభ్యంతరం చెప్పామా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ బాగుంటే తాము ఆనందిస్తామని వ్యాఖ్యానించారు.
ప్రైవేట్ చేతుల్లో ఉన్న లిక్కర్ వ్యాపారాన్ని జగన్ తన చేతుల్లోకి తీసుకున్నారని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. మద్యం తయారీ దగ్గర నుంచి అమ్మకం దాకా అంతా జగనే పర్యవేక్షించారని ఆరోపించారు. చిరు వ్యాపారుల దగ్గర కూడా ఆన్‌లైన్ సేవలు ఉంటాయని... కానీ వేల కోట్ల వ్యాపారం చేసే లిక్కర్ షాపుల్లో ఎందుకు పెట్టలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు.