Home » AP Police
హైదరాబాద్‌లో లిక్కర్ కేసులో భాగంగా సిట్ సీజ్ చేసిన రూ.11 కోట్లపై తనకు అనుమానాలు ఉన్నాయని రాజ్ కసిరెడ్డి కోర్టులో వాదించారు. రూ.11 కోట్ల విషయంలో.. ఆధారాలు ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు బుధవారం రిమాండ్ ముగిసింది. రిమాండ్ ముగియడంతో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టుకు రాజమండ్రి పోలీసులు తరలించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో మిథున్‌రెడ్డి ఉన్న విషయం తెలిసిందే.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నడుమ చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డిని పులివెందుల వైసీపీ ఆఫీస్‌కు పోలీసులు తరలించారు.
ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో విచారణకు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ హాజరయ్యారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ నోటీసులు జారీ చేశారు.
154 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన వైసీపీ నేతలకు బుద్ధి రావడం లేదని మంత్రి డోల వీరాంజనేయ స్వామి విమర్శించారు. ఈరోజు పులివెందులలో కూడా వైసీపీ ఓటమి ఖాయమని.. వారు జీర్ణించుకోలేకపోతున్నారని ఆక్షేపించారు. ఓటమిని జీర్ణించుకోలేక రెక్కింగ్ చేస్తున్నారని, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి డోల వీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు.
సృష్టి ఫెర్టిలిటీ స్కాం కేసులో కీలక సూత్రధారి డాక్టర్ నమ్రతకు ఉచ్చు బిగిస్తోంది. డాక్టర్ నమ్రత బ్యాంక్ అకౌంట్లు, బినామీ అకౌంట్లు, ఆస్తులపై దర్యాప్తు బృందం రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో అక్రమ సరోగసీ, ఐవీఎఫ్, శిశువుల అక్రమ రవాణా చేసి కోట్లాది రూపాయలను డాక్టర్ నమ్రత సంపాదించినట్లు సమాచారం.
మ్మడి కడప జిల్లాలోని రెండుచోట్ల జరిగే జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఆదివారం సాయంత్రానికి ప్రచార సమయం ముగియడంతో అంతా గప్‌చుప్‌గా మారింది. పులివెందుల నుంచి టీడీపీ జడ్పీటీసీ సభ్యురాలిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తుండగా, వైసీపీ నుంచి హేమంత్‌రెడ్డి బరిలో ఉన్నారు.
మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలో ఆరు మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ చెప్పుకొచ్చారు. వారి నుంచి ఒక టన్ను ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
వైసీపీ నేతల చేతిలో దారుణ హింసకు గురైన పవన్ కుమార్‌ను చిత్తూరులో బంధించింది ఎవరు? అతని వాయిస్ రికార్డు చేసి వీడియోలు విడుదల చేసిందెవరు? తిరుపతిలో దాడికి గురైన పవన్ చిత్తూరుకు ఎలా వెళ్లాడు? రౌడీ మూకలకు భయపడి తలదాచుకున్నాడా? లేకుంటే ఎవరైనా బలవంతంగా తీసుకెళ్లి బంధిం చారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తిరుపతి జిల్లా పోలీసుల పొదిలోకి ఇటీవల అందిన ఒక సాంకేతిక ఆయుధం డ్రోన్ భిన్న అవసరాలకు ఉపయోగపడే వివిధ సామర్థ్యాలున్న 9 డ్రోన్లు ప్రభుత్వం తిరుపతికి కేటాయించింది. దేశ నలుమూ లల నుంచి వచ్చే జనంలో నేరస్థులు సులువుగా కలగలిసిపోయే అవకాశమున్న ప్రాంతం కావడంతో వీటి అవసరం మరీ ఎక్కువ. అలాగే తరచూ వీవీఐపీల పర్యటనలు, భారీ సభలు జరుగుతుండటంతో క్రౌడ్ కంట్రోల్‌కి కూడా డ్రోన్ల సాయం పోలీసులకు బాగా ఉపయోగపడుతోంది.