Alampur Traffic Diversion: ప్రయాణికులకు అలర్ట్.. అలంపూర్ చౌరస్తా నుంచి దారి మళ్లింపు
ABN , Publish Date - Oct 16 , 2025 | 11:18 AM
ప్రస్తుతం ఆ రూట్‌లో వెళ్లే భారీ వాహనాలను దారి మళ్లింపు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పూర్తిగా వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు.
జోగులాంబ గద్వాల: కర్నూల్ పట్టణంలో ప్రధాని నరేంద్ర మోదీ సభ సందర్భంగా.. తెలంగాణ రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతమైన అలంపూర్ చౌరస్తా నుంచి వాహనాలను అధికారులు దారి మళ్లిస్తున్నారు. బెంగళూరు, అనంతపురం వైపు వెళ్లే వాహనాలను అలంపూర్ చౌరస్తా నుంచి మంత్రాలయం, ఎమ్మిగనూరు మీదుగా దారి మళ్లింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అలాగే.. చెన్నై, తిరుపతి, కడప నంద్యాల, శ్రీశైలం వెళ్లే వాహనాలను.. బ్రాహ్మణ కొట్కూర్, నందికొట్కూర్ మీదుగా దారి మళ్లిస్తున్నారు.
ప్రస్తుతం ఆ రూట్‌లో వెళ్లే భారీ వాహనాలను దారి మళ్లింపు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పూర్తిగా వాహనాలను దారి మళ్లించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పూర్తి ట్రాఫిక్ కంట్రోల్‌ను తెలంగాణలోని అలంపూర్ చౌరస్తా దగ్గర ఏపీ పోలీసులు సమన్వయం చేసుకుంటున్నారు. వాహనాల దారి మళ్లింపుతో అలంపూర్ చౌరస్తాలో భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది.
మరోపైపు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. కొందిసేపటి క్రితం కర్నూల్‌లోని ఓర్వకల్లు విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ఆయనకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనానికి ప్రధాని మోదీ శ్రీశైలం వెళ్లారు.