Female Passenger On Rash Behavior: ఆర్టీసీ బస్సులో మహిళ వీరంగం.. ఏం చేసిందంటే..
ABN , Publish Date - Oct 16 , 2025 | 08:53 PM
ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో పరిటాల గ్రామానికి చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు వీరంగం సృష్టించింది. జగ్గయ్యపేట డిపోనకు చెందిన బస్సులో విజయవాడ వైపు వెళ్తున్న బస్సులో ఎక్కింది సదరు మహిళ.
ఎన్టీఆర్ జిల్లా, అక్టోబరు16(ఆంధ్రజ్యోతి): ఏపీఎస్ ఆర్టీసీ బస్సు (APSRTC Bus)లో పరిటాల (Paritala) గ్రామానికి చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు (Female Passenger) వీరంగం (Rash Behavior) సృష్టించింది. జగ్గయ్యపేట డిపోనకు చెందిన బస్సులో విజయవాడ (Vijayawada) నుంచి పెనుగంచిప్రోలు వెళ్తున్న బస్సులో ఎక్కింది సదరు మహిళా.
పుట్‌పాత్‌లో ఉన్న మహిళను లోపలికి రమ్మని చెప్పారు కండక్టర్. తననే లోపలికి రమ్మంటావా అంటూ కండక్టర్‌పై వాగ్వాదానికి దిగింది మహిళ. కండక్టర్ అయ్యప్ప మాలలో ఉండటంతో అలా మాట్లాడవద్దని చెప్పినా.. ఆమె వినకుండా అసభ్యంగా మాట్లాడింది. అయితే, పరిటాలలో బస్సు ఆపకుండా కంచికచర్ల పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులకు అప్పగించారు కండక్టర్.
ఆమె గురించి పూర్తిగా విచారిస్తున్నారు కంచికచర్ల పోలీసులు (Kanchikacherla Police). అయితే, సదరు మహిళపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. గతంలో కూడా సదరు మహిళా పరిటాలలో తన ఇంటి వద్ద కూడా హడావుడి చేయడంతో ఆమె బంధువులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు సదరు మహిళా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Pawan Kalyan On GST Meeting: ప్రధాని మోదీని కర్మయోగిగా చూస్తాం: పవన్ కల్యాణ్
Read Latest AP News And Telugu News