Kurnool Bus Fire: ప్రయాణికుడి ఫిర్యాదు.. వి.కావేరి ట్రావెల్స్‌పై కేసు నమోదు
ABN , Publish Date - Oct 26 , 2025 | 09:40 AM
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి.కావేరి ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఓ ప్రయాణికుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కర్నూలు: చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్‌తో పాటు యజమానిపై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఏ-1గా డ్రైవర్, ఏ-2గా ట్రావెల్స్ యజమానిపై కేసులు నమోదు అయినట్లు పేర్కొన్నారు. రమేష్ అనే ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బస్సు డ్రైవర్, ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే.. ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని రమేష్ ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి.కావేరి ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఓ బైక్‌ను బస్సు ఢీకొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి అంతకంతకూ పెరిగి బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బస్సులోనే 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. మరికొందరు మంటలను చూసిన వెంటనే అద్దాలను పగులగొట్టి బయటకు దూకి ప్రాణాలను దక్కించుకున్నారు. బైకు బస్సు కిందకు వెళ్లి డీజిల్ ట్యాంక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి..
Investment in Adani Raises: జీవిత బీమా..అదానీకి ధీమా
Congress Demands: పీఏసీ దర్యాప్తు జరగాలి కాంగ్రెస్