Home » AP News
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా నిష్పత్తికి అనుగుణంగా స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ.. ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ ఏపీ స్టేట్ యూనిట్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ఎ. వెంకటేశ్వర్లు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.
తండ్రి ఒడిలో ఒదిగ్గా ఉన్న ఈ చిన్నారిని చూశారా.. ముద్దొస్తోంది కదా! వయసు రెండుమూడేళ్లు ఉంటాయనుకుంటుటే తప్పులో కాలేసినట్లే!.. ఆ పాప వయసు అక్షరాల 13 సంవత్సరాలు. పేరు గంటా కీర్తి. తండ్రి గంటా వాసుదేవరావు.
సింహాచలం దేవస్థానానికి చెందిన భూములను హైపర్ స్కేల్ డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్ సంస్థకు బదలాయించడంపై అభ్యంతరం తెలుపుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ..
ఎంబీబీఎస్ వైద్య విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణకు కళాశాలల్లో మెంటార్-మెంటీ వ్యవస్థను బలోపేతం చేయాలని హెల్త్ వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్ కోరారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాప్రస్థానం పూర్తి చేస్తున్న సందర్భంగా ఈ నెల 7న విజయవాడ ఇంద్రకీలాద్రిపైన ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో ప్రధాని పేరిట ప్రత్యేకంగా ఖడ్గమాలార్చన నిర్వహిస్తున్నట్లు జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ తెలిపారు.
మద్యం రవాణా స్కామ్‌లో వైసీపీ మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావును ’సిట్’ కస్టడీకి తీసుకుంది. జగన్ ప్రభుత్వంలో మద్యం రవాణా ధరలు భారీగా పెంచేసి లబ్ధి పొందిన వారిలో కారుమూరు కుటుంబం ముందు వరుసలో ఉంది.
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో (యూసీఎ్‌సఎ్‌ఫ)కు డాక్టర్ శ్రీమన్నారాయణ అంబటి, ఆయన సతీమణి రమ అంబటి దంపతులు రూ.10 కోట్ల విలువైన 1 మిలియన్ డాలర్ల శాశ్వత నిధిని (ఎండోమెంట్) విరాళంగా ప్రకటించారు.
విశాఖలోని ఎండాడలో ఖరీదైన భూముల కేసులో జిల్లా సర్వే అధికారి వైఫల్యం బయటపడింది. ఆయన ప్రైవేటు వ్యక్తులకు కొమ్ముకాశారని, విలువైన ప్రభుత్వ భూమిని వారు దోచుకునేందుకు అవసరమైన ప్రాతిపదికను సిద్ధం చేశారని ప్రభుత్వం గుర్తించింది.
ప్రజలకు అందించే ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెరగాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అందుకు ప్రభుత్వ ఉద్యోగులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ తమ నైపుణ్యాలను, సామర్థ్యాన్ని మెరుగు పరుచుకోవాలన్నారు.
భారత నౌకాదళానికి చెందిన మొట్టమొదటి స్వదేశీ ఫ్లీట్ సపోర్ట్ షిప్-1 (ఎఫ్‌ఎ్‌సఎస్-1) మంగళవారం జలప్రవేశం చేయనుంది. నేవీ కోసం హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్‌ఎ్‌సఎల్) నిర్మించిన ఈ సహాయక యుద్ధ నౌకను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నంలో జలప్రవేశం చేయించనున్నారు.