అమరావతిలో 22 సంస్థలకు భూ కేటాయింపులు
ABN , Publish Date - Feb 20 , 2026 | 05:21 AM
రాజధాని అమరావతిలో 22 సంస్థల భూకేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో చర్చించింది. 7 కొత్త సంస్థలకు భూకేటాయింపులకు సబ్‌కమిటీ ఆమోదం తెలిపింది.
7 కొత్త సంస్థలకు కేటాయింపులకు ఉపసంఘం ఆమోదం
అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో 22 సంస్థల భూకేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో చర్చించింది. 7 కొత్త సంస్థలకు భూకేటాయింపులకు సబ్‌కమిటీ ఆమోదం తెలిపింది. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, 11 సంస్థలకు గతంలో చేసిన కేటాయింపుల్లో మార్పులు చేశామని తెలిపారు. ఒక సంస్థకు భూకేటాయింపు అంశం పెండింగ్‌లో ఉందన్నారు. బ్యాంకుల సిబ్బంది నివాస స్థలం కోసం భూకేటాయింపునకు సబ్‌కమిటీ ఆమోదం తెలిపింది. భారత వాతావరణ శాఖకు ఎకరా భూమి, ఈటీపీఆర్‌కు 0.74 ఎకరాలు కేటాయించామన్నారు. కేవీబీకి 0.4 ఎకరాలు, నాబార్డ్‌కు ఎకరా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు అర ఎకరా, రెయిన్‌బో చిల్డ్రన్ ఆస్పత్రికి 2 ఎకరాలు కేటాయించేందుకు సబ్‌కమిటీ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు భూములు పొందిన సంస్థల నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయనే దానిపై చర్చించామని తెలిపారు. అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, దేశం మొత్తం అమరావతి నిర్మాణం వైపు చూస్తోందని నారాయణ పేర్కొన్నారు.