నకిలీ మద్యం కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు
ABN , Publish Date - Feb 20 , 2026 | 05:47 AM
నకిలీ మద్యం తయారీ కేసులో నిందితులకు విజయవాడ ఆరో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు మార్చి 5వరకు రిమాండ్ పొడిగించింది.
విజయవాడ, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం తయారీ కేసులో నిందితులకు విజయవాడ ఆరో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు మార్చి 5వరకు రిమాండ్ పొడిగించింది. నెల్లూరులోని కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న సింథిల్‌కుమార్, టి.రమేశ్‌ను జైలు సిబ్బంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయాధికారి ముందు గురువారం హాజరుపరిచారు. వారికి మార్చి ఐదో తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
మద్యం కేసులో నిందితుల బెయిల్‌పై విచారణ వాయిదా
మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు 21వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను శనివారానికి వాయిదా వేసింది.