Home » AP News
‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’ పేరుతో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన చర్చా వేదికలో ప్రస్తావించిన సమస్యకు ఎట్టకేలకు మోక్షం లభించింది. విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని క్రీడాకారులకు మంచి వేదిక అందుబాటులోకి వచ్చింది.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ అన్నారు. ఏడాదిలో ‘వన్ స్టార్’ రేటింగ్‌తో ఉన్న పాఠశాలలను ‘టూ స్టార్’కు అప్‌గ్రేడ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ తీపి కబురు చెప్పింది. జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించిన విధంగా ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. 166 గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి సోమవారం నోటిఫికేషన్ ఇచ్చింది.
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు, క్యాడర్, ప్రమోషన్ తదితర అంశాలపై స్పష్టత ఇవ్వకపోవడం ఇప్పుడు ఉద్యోగులకు సమస్యగా మారింది. దానివల్ల సచివాలయాల ఉద్యోగులు చాలామంది సంవత్సరాల తరబడి ఒకే స్థాయిలో కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. రాష్ట్రానికి కొత్తగా రూ.23,994.94 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. 11,289 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఆ సంస్థలు తెలిపాయి.
స్విట్జర్లాండ్‌తో ఏపీకి ఉన్న ఆర్థిక, పారిశ్రామిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రి టీజీ భరత్ కీలక చర్చలు నిర్వహించారు. స్విస్ కాన్ఫెడరేషన్ స్టేట్ సెక్రటరీ ఫర్ ఎకనామిక్ అఫైర్స్ హెలెనా బుడ్లిగర్ ఆర్టియడాతో సోమవారం మంత్రి భరత్ భేటీ అయ్యారు.
అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కంపెనీలు క్యూ కడుతున్నాయి. తాజాగా క్వాంటమ్ హార్డ్‌వేర్, హెల్త్‌కేర్ రిసెర్చ్ సెంటర్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సంస్థలు పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టనున్నాయి. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన కంపెనీల వివరాలు ఇలా...
ఏపీ హైకోర్టులో ఐదుగురు జడ్జీలు శాశ్వత న్యాయమూర్తులుగా సోమవారం ప్రమాణం చేశారు. హైకోర్టు సీజే లిసాగిల్ న్యాయమూర్తులు జస్టిస్ కుంచెం మహేశ్వరరావు, జస్టిస్ టీసీ.ధనశేఖర్, జస్టిస్ చల్లా గుణరంజన్..
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. రాష్ట్రంలో వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్), ఓటర్ల జాబితా ఖరారుపై ఏపీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బుగ్గమఠం భూముల వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. దేవదాయ చట్టం కింద అధికారులు చేపట్టిన చర్యలను సవాల్ చేస్తూ,...