Home » AP Liquor
మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు ప్రదర్శిస్తుంది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు, నివాసాల్లో సోదాలు చేపట్టింది.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని మంగళవారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.
మా అమ్మను పోలీసులు బెదిరిస్తున్నారంటూ లిక్కర్ స్కాం కేసు నిందితుడు ఏ30 పైలా దిలీప్ పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ స్కాం కేసు డబ్బులతో నిర్మించినట్లు ఒప్పుకోవాలని..
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ-30 పైలా దిలీప్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పైలా దిలీప్‌కు బెయిల్ ఇస్తూ ఏసీబీ కోర్టు షరతులు విధించింది.
కస్టోడియల్ విచారణ అని సిట్ తనన్ను అరెస్టు చేసిందని రాజ్ కసిరెడ్డి వ్యాఖ్యానించారు. లిక్కర్ స్కామ్ కేసులో తన పాత్ర ఎక్కడా లేదని వివరించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. తిరుమలలోమత విశ్వాసాల గౌరవించి సంతకం పెట్టమంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు పెట్టలేదని నిలదీశారు. టీటీడీపైన బురదజల్లే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు.
వైసీపీ హయాంలో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి కీలకంగా ఉండటంతో శుక్రవారం ఉదయం నుంచి నారాయణ స్వామిని సిట్ అధికారులు విచారించారు. ఆరు గంటల పాటు కొనసాగిన విచారణ ముగిసింది. అయితే ఈ విచారణలో నారాయణ స్వామి సిట్ అధికారుల ప్రశ్నలకు దాటవేసినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త బార్ పాలసీ నిర్ణయం తీసుకుందని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు. 840 బార్లు ఏపీ వ్యాప్తంగా ఉన్నాయని.. పది శాతం కల్లు గీత కులస్థులకు కేటాయిస్తామని పేర్కొన్నారు. కొత్త వారూ ఈ బిజినెస్‌లోకి రావడానికి కొన్ని మార్పులు చేశామని వివరించారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు బుధవారం రిమాండ్ ముగిసింది. రిమాండ్ ముగియడంతో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టుకు రాజమండ్రి పోలీసులు తరలించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో మిథున్‌రెడ్డి ఉన్న విషయం తెలిసిందే.
మరి కొద్దిసేపట్లో.. విజయవాడ ఏసీబీ కోర్టులో రెండవ ఛార్జ్ షీట్ దాఖలు చేయనోంది సిట్. 200 పేజీలతో రెండవ ఛార్జ్ షీట్‌ను రెడీ చేసినట్లు సిట్ అధికారులు తెలుపుతున్నారు.