Home » AP Govt
ఆంధ్రప్రదేశ్ స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
పల్లెల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి వెలుగులు నింపనుంది. ఈ నెల 29వ తేదీన పల్లె పండుగ 3.0కి శ్రీకారం చుట్టనుంది.
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లాలోని తన స్వగ్రామమైన సబ్బవరంలో అగ్నిమాపక కేంద్ర నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ మేరకు అగ్ని మాపక సిబ్బంది సేవలను కొనియాడారు.
ఏపీ వ్యాప్తంగా ఆహార భద్రత శాఖ ఆకస్మికంగా సోదాలు నిర్వహించింది. ఈ మేరకు పలు హోటళ్ళు, రెస్టారెంట్ల యాజమాన్యాలపై కేసులు నమోదు చేసింది.
పేదలకు పట్టాభిషేకంలో భాగంగా మరో ప్రతిష్ఠాత్మక ఘట్టానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 30న విజయవాడలో ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాలను లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో సాధించిన 94 శాతం ఫలితాల కంటే మెరుగైన ఫలితాలను సాధించడమే కూటమి లక్ష్యమని వ్యాఖ్యానించారు.
కర్నూలు ఎయిర్‌పోర్టులో రాష్ట్రంలోనే మొట్టమొదటి ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కావడం సంతోషకరమని ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కర్నూలు విమానాశ్రయం నిర్మాణానికి 2017లో శంకుస్థాపన చేసి, తక్కువ వ్యవధిలోనే దానిని ప్రారంభించామని పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా చర్యలు చేపట్టిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు.
అభివృద్ధి ఫలాలు, ప్రజల దైనందిన జీవితాలను మెరుగుపరచడమే తన ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊతం అందించింది. కేంద్ర ప్రభుత్వ భారత్ ఔద్యోగిక వికాస్ యోజన పథకం కింద రాష్ట్రంలో 11 కొత్త పారిశ్రామిక పార్కులు ఏర్పాటు కానున్నాయి.