Home » AP Govt
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు.
భగవాన్ సత్యసాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని.. బాబా కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారని పేర్కొన్నారు.
ఏపీలో మత్తు పదార్థాల రవాణాను చాలా వరకు నివారించామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఏపీలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని తెలిపారు.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా భక్తులకు ఏపీ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమతత్వమే మానవత్వం.. సమానత్వమే సాయి తత్వమని సత్యసాయి చాటి చెప్పారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టిసారించి పరిష్కరిస్తున్నామని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులంతా లెర్నింగ్ అవుట్ కమ్స్‌పై శ్రద్ధపెట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సర్వీసును పొడిగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరుతో ముగియనున్న సీఎస్ కె. విజయానంద్ సర్వీసును మరో 3 నెలల పాటు పొడిగించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.
గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు చేసిందేమీ లేదని ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి మత్స్యకారులకు వలలు, బోట్లకి సబ్సిడీ ఇస్తోందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్ర ఎస్ఎస్సీ బోర్డు. 2026 మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ జరుగనున్నాయి.
విశాఖపట్నంలో భూముల రీసర్వేలో వస్తున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించినట్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, రాష్ట్ర శాసనసభపక్ష ఫిర్యాదుల కమిటీ చైర్మన్ రఘురామ కృష్ణరాజు తెలిపారు. రీసర్వేలో తమ కమిటీకి ప్రజల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయని.. వీటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
సత్యసాయి బాబా చెప్పిన మాటలు తాను ఎప్పటికీ మర్చిపోలేనని ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ వ్యాఖ్యానించారు. సత్యసాయి బాబా సూచించిన ఐదు విధానాలను తాను ఇప్పటికీ పాటిస్తానని పేర్కొన్నారు.