Share News

యువత క్రీడల్లో రాణించేందుకు శాప్ లీగ్ గొప్ప వేదిక: పీవీ సింధూ

ABN , Publish Date - Feb 16 , 2026 | 06:16 PM

యువత క్రీడల్లో రాణించేందుకు శాప్ లీగ్ గొప్ప వేదిక అని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ వ్యాఖ్యానించారు. శాప్ లీగ్ మ్యాచ్‌ల ద్వారా యువతకు సువర్ణావకాశం లభిస్తుందని పేర్కొన్నారు..

యువత క్రీడల్లో రాణించేందుకు శాప్ లీగ్ గొప్ప వేదిక: పీవీ సింధూ
SHAP League Launch

విజయవాడ, ఫిబ్రవరి16 (ఆంధ్రజ్యోతి): యువత క్రీడల్లో రాణించేందుకు శాప్ లీగ్ (SHAP League) గొప్ప వేదిక అని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ (PV Sindhu) వ్యాఖ్యానించారు. శాప్ లీగ్ మ్యాచ్‌ల ద్వారా యువతకు సువర్ణావకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి శాప్ ఆధ్వర్యంలో లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 14 క్రీడలతో లీగ్ మ్యాచ్‌లు నిర్వహించడానికి ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించిన ట్రోఫీని సోమవారం విజయవాడలో ఆవిష్కరించారు.


ఈ కార్యక్రమంలో పీవీ సింధూ, కోనేరు హంపీ, శాప్ చైర్మన్ రవి నాయుడు, శాప్ ఎంపీ భరణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు చిన్నారులతో చెస్ ఆడి సందడి చేశారు. అనంతరం పీవీ సింధూ మాట్లాడుతూ.. శాప్ లీగ్ నిర్వహించడం వల్ల యువతలో క్రీడలపై ఆసక్తి పెరుగుతోందని తెలిపారు. స్పోర్ట్స్ అనేది ప్రతి వ్యక్తికి ముఖ్యమని చెప్పుకొచ్చారు. చాలామంది యువతి, యువకులకు శాప్ లీగ్ ఒక మంచి అవకాశమని వివరించారు. ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పీవీ సింధూ సూచించారు.


శాప్ లాంచ్ విజయవాడలో జరగడం సంతోషంగా ఉంది: కోనేరు హంపీ

శాప్ లీగ్ కప్ లాంచ్ విజయవాడలో జరగడం చాలా సంతోషంగా ఉందని కోనేరు హంపీ పేర్కొన్నారు. సీఎం నారా చంద్రబాబు ప్రభుత్వంలో స్పోర్ట్స్‌కి మంచి ప్రాధాన్యత ఉందని చెప్పుకొచ్చారు. శాప్ చాలా మంచి కార్యక్రమన్ని రూపొందించిందని అన్నారు. క్రీడల్లో రాణించాలనే యువతి, యువకులకు శాప్ ఒక మంచి అవకాశమని కోనేరు హంపీ తెలిపారు.


శాప్ మ్యాచ్‌‌ల కోసం ప్రత్యేక వెబ్‌సైట్: శాప్ ఎండీ భరణి

శాప్ లీగ్ మ్యాచ్‌లు ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు జరుగుతాయని శాప్ ఎండీ భరణి వెల్లడించారు. శాప్ లీగ్ మ్యాచ్‌ల ద్వారా విద్యార్థులు స్కూల్ నుంచే క్రీడల్లో ప్రతిభ చూపే మంచి అవకాశమని చెప్పుకొచ్చారు. శాప్ మ్యాచ్‌ల ద్వారా విద్యార్థులు స్కూల్ నుంచి వారి క్రీడాస్ఫూర్తిని ప్రారంభించి రాష్ట్ర స్థాయి వరకు వెళ్లే సువర్ణావకాశం ఉందని వివరించారు. శాప్ మ్యాచ్‌‌లకు సంబంధించి ప్రతి ఒక్కటీ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ఉంచుతున్నామని తెలిపారు. శాప్ మ్యాచ్‌‌ల కోసం ప్రత్యేక వెబ్‌సైటు రూపొందించామని అన్నారు. ప్రతి జిల్లాలో ఆ జిల్లా క్రీడా శాఖ అధికారి ప్రర్యవేక్షణలో ఈ గేమ్స్ జరగనున్నాయని శాప్ ఎండీ భరణి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీ ప్రభుత్వంపై బిల్‌గేట్స్ ప్రశంసలు..

ఏపీ అభివృద్ధికి గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక మలుపు: పవన్ కల్యాణ్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 16 , 2026 | 07:19 PM