Home » AP Govt
మొంథా తుపానుతో అప్రమత్తంగా ఉండాలని ఏపీ మంత్రి సవిత ఆదేశాలు జారీచేశారు. తుపాను దృష్ట్యా చేపట్టే చర్యలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. వార్డెన్లు, ఏబీసీడబ్ల్యూవోలు 24 గంటలూ హాస్టళ్లలో ఉండాల్సిందేనని ఆజ్ఞాపించారు మంత్రి సవిత.
వైసీపీ శ్రేణులు యథేచ్ఛగా రెచ్చిపోతున్నాయి. జగన్ హయాంలో సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి ప్రతిపక్షాల నేతలను ఇబ్బందులకు గురిచేశాయి. కూటమి ప్రభుత్వంలోనూ టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణులు అభ్యంతరకరంగా పోస్టులు పెడుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రయత్నిస్తుందని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సర్కార్ తీసుకువచ్చిన జీవో-32పై ఏపీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు.
మొంథా తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పాఠశాలలనూ మూసివేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
కర్నూలు వేమూరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి కారకుడైన బైకర్ శివశంకర్ బెల్ట్ షాపులో మద్యం తాగాడంటూ వైసీపీకి అనుకూలమైన బ్లూ మీడియాతో సహా కొన్ని మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుంది వైసీపీ అనుకూల మీడియా. అయితే, ఈ ఘటనపై దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై ప్రభుత్వం సీరియస్ అయింది.
పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టమని తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. జగన్ హయాంలో కొంతమంది రాజకీయ నేతల అండదండలు చూసుకొని వేంకటేశ్వర స్వామివారి సొమ్ములు కాజేశారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
చిన్నటేకూరు బస్సును బైక్‌తో ఢీకొని మృతిచెందిన శివ శంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి ఫిర్యాదుతో శివ శంకర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 281,125(A), 106(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి.కావేరి ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఓ ప్రయాణికుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉత్తర కోస్తా జిల్లాలు అయిన శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్ఆర్, ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు జోనల్ ఇన్చార్జిగా అజయ్ జైన్‌ను.. దక్షిణ కోస్తా జిల్లాలు వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు జోనల్ ఇన్చార్జిగా ఆర్పీ సిసోడియాలను నియమించారు.
మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులకి రాష్ట్ర సర్కార్ దిశానిర్దేశం చేసింది.