Home » AP Govt
1200 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు సుప్రీంకోర్టు శుభవార్త తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నియమించిన మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లని విధుల్లోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
నవ్యాంధ్రప్రదేశ్లో సంపద సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిలో దుబాయి, గల్ఫ్ దేశాల్లోని తెలుగు వైశ్య వ్యాపాస్థులు తమ వంతుగా పూర్తిగా సహకరిస్తామని సంసిద్ధత వ్యక్తం చేశారు.
తుపాను నేపథ్యంలో ప్రాణ, ఆస్తినష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సహాయక చర్యలు, పునరావాసం, నష్టం అంచనా అంశాలపై ఫోకస్ పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
మొంథా తుపాను తీవ్రత నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 30 కొనుగోలు కేంద్రాలలో తక్షణమే పత్తి సేకరణ చేపట్టాలని సీసీఐ, సంబంధిత అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు.
మొంథా తుపాన్ ప్రభావంతో రాష్ట్రమంతా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది.
మొంథా తుపాన్ కారణంగా రాష్ట్రంలో రైల్వే శాఖ రైలు సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం నుంచి నడిచే దాదాపు 100 మేర విమాన సర్వీసులు రద్దయ్యాయి.
వర్షాలకు వెయ్యి హెక్టర్లలో వరి, వేరుశెనగ, మినుము, పెసర, కూరగాయల పంటలు నీటమునిగాయి. మరోవైపు రహదారులు జలమయం అయ్యాయి.
మొంథా తుఫాను ప్రభావంతో రాష్ట్రమంతా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో.. జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది.
వివిధ జిల్లాల్లో కురిసిన వర్షపాతంపై అధికారులను మంత్రి లోకేశ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
ఇప్పటికే జిల్లాల సరిహద్దుల మార్పుపై వచ్చిన ప్రజా అభిప్రాయాలు, ప్రతిపాదనలు సేకరణ పూర్తయినట్లు సమాచారం. ఇప్పుడు వాటిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.