CM Chandrababu: పాసు పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం.. అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
ABN , Publish Date - Jan 09 , 2026 | 03:36 PM
పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకున్న రైతులంతా సభకు రాకపోవటంపై కలెక్టర్, రెవెన్యూశాఖ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
రాజమహేంద్రవరం, జనవరి 9: పాసు పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పాసు పుస్తకాలు తీసుకున్న రైతులంతా సభకు రాకపోవటంపై కలెక్టర్, రెవెన్యూశాఖ అధికారులపై సీఎం మండిపడ్డారు. ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీలో పారదర్శకత ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
చేసి చూపించాం...
‘మీ భూమి మీద హక్కు’ ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల పంపీణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘మీ భూమి - మీ హక్కు’... చేసి చూపించామన్నారు. రైతులకు ఎప్పుడూ అన్యాయం జరగకూడదని అన్నారు. కరోనా సమయంలోనూ పనిచేసి రైతులు అందరికీ అన్నం పెట్టారని గుర్తుచేశారు. ఏపీలో 6,680 ఎకరాల్లో రీ సర్వే చేశామని.. 22.30 లక్షల పాస్ పుస్తకాలు సిద్ధం చేశామని చెప్పారు.
వారి ఆలోచనలు ప్రమాదకరం...
గత ప్రభుత్వ నేతలవి ప్రమాదకరమైన ఆలోచనలని మండిపడ్డారు చంద్రబాబు. రైతుల భూమి పత్రాలపై జగన్ ఫొటో ఎందుకు వేశారో అర్థం కాలేదని విమర్శించారు. గతంలో పట్టాదారు పాసు పుస్తకాలకు జగన్ ఫొటో పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్‌లింగ్ యాక్ట్ రద్దు చేశామని తెలిపారు. ఈ పట్టాదారు పాసు పుస్తకాన్ని ఎవరూ ట్యాంపరింగ్ చేయలేరని తెలిపారు. ఎవరైనా ట్యాంపరింగ్ చేస్తే గుర్తించి శిక్షించే పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
అలాస్కా ట్రిప్.. మైనస్ 40 డిగ్రీల చలి.. తెలుగు విద్యార్థి అదృశ్యం
కేటీఆర్‌పై గజ్జెల కాంతం షాకింగ్ కామెంట్స్
Read Latest AP News And Telugu News