Home » AP Govt
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫొరెన్సిక్ అధికారికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం దక్కింది. 2025 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘కేంద్రీయ గృహమంత్రి దక్షిత’ పతాకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫొరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (APFSL) DNA విభాగంలో సహాయ సంచాలకులుగా విధులు నిర్వహిస్తున్న బొమ్మకంటి ఫణిభూషన్ ఎంపికయ్యారు.
టీడీపీ నేతలకి సంబంధించిన తిరువూరు విభేదాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ లైన్ ఎవరు దాటినా సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
టీటీడీ పరకామణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ప్రపంచ పర్యాటక యవనికపై ఏపీని నిలబెడుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. నవంబరు 4వ తేదీ నుంచి 6 వ తేదీ వరకు లండన్‌లో పర్యటిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
మొంథా తుఫానుతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని అధికారులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లా పరిధిలో పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు పకడ్బందీగా రూపొందించాలని పవన్ కల్యాణ్ మార్గనిర్దేశం చేశారు.
నవంబర్ 15లోపు 250 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని అసోషియేషన్ వెల్లడించింది. అన్ని బకాయిల పరిష్కారానికి ఒకేసారి సెటిల్మెంట్ విధానానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
భగవద్గీతపై ఎమ్మెల్యే ఎమ్.ఎస్.రాజు వ్యాఖ్యలు అర్థరహితమని ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. భగవద్గీతతో ప్రయోజనం లేదన్న అతనికి టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
తుఫాన్ సమయంలో ఏ ఒక్కరికీ ప్రాణ నష్టం జరగకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. దాదాపు 1500 మంది విద్యుత్ శాఖ సిబ్బందిని ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాలకు పంపించినట్లు పేర్కొన్నారు.
కడపకు చెందిన మహబూబ్‌ఖాన్ దగ్గర రూ.60 లక్షలు అడ్వాన్స్ తీసుకుని భారతి సిమెంట్ మేనేజర్ భార్గవ్ రెడ్డి మొహం చాటేసినట్లు తెలుస్తోంది. దీంతో మహబూబ్‌ఖాన్ కోర్టును ఆశ్రయించారు.